RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత 4 నెలల వరకు ఏ ఇండియన్ సినిమా విడుదల చేయడానికి సాహసించకండి.. ఈ మాట అన్నది ఎవరో కాదు..
Salman Khan RRR: ప్రస్తుతం యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి దర్శకత్వం వహించిన
Salman Khan RRR: ప్రస్తుతం యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో అందరి దృష్టి సినిమాపై పడింది. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. బహుశా ఓ తెలుగు సినిమా కోసం బాలీవుడ్ సినీ పెద్దలు ఎదురుచూస్తుండడం ఇదేతొలిసారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదేమో. అందుకు తగ్గట్లుగానే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబయిలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఆదివారం ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత నాలుగు నెలల వరకు ఏ ఇండియన్ సినిమాను విడుదల చేయడానికి సాహసించకండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం సల్మాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై బాలీవుడ్ అగ్ర హీరో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇక అంతేకాకుండా సల్మాన్ ఈ వేదికగా మరో విషయాన్ని తెలియజేశారు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘బజరంగీ భాయిజాన్’ చిత్రానికి సీక్వెల్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముంబయిలో జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేయలేదు. స్టార్ ఇండియా ఈ ఈవెంట్ ను డిసెంబర్ 31న ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..