Salman Khan Birthday: సల్మాన్ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్ టైటిల్ వెల్లడి..

Salman Khan Birthday: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఈరోజు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్

Salman Khan Birthday: సల్మాన్ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌.. బజరంగీ భాయిజాన్ సీక్వెల్ టైటిల్ వెల్లడి..
Salman Khan

Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:07 PM

Salman Khan Birthday: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఈరోజు 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సల్మాన్ ఖాన్ పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటారు. అయితే కరోనా కారణంగా చాలా తక్కువ మందిని పార్టీకి ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం సల్మాన్ తన పుట్టినరోజును పన్వెల్ ఫామ్ హౌస్‌లో జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్కడే వేడుక జరుగుతోంది. పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ తన రాబోయే సినిమాల గురించి చెప్పారు.

పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం బజరంగీ భాయిజాన్ 2 టైటిల్‌ను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ ఈ సినిమా సీక్వెల్ గురించి సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సల్మాన్ నో ఎంట్రీ సీక్వెల్ కూడా చేస్తానని ప్రకటించారు.మీరు చిత్ర నిర్మాత ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి పని చేయబోతున్నారా అని సల్మాన్ ఖాన్‌ను అడిగినప్పుడు దీనిపై సల్మాన్ నో చెప్పారు. ‘నేను అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయబోతున్నాను. ప్రస్తుతం బజరంగీ భాయిజాన్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నాడు పవన్ పుత్ర భాయిజాన్ అని చిత్రానికి టైటిల్ పెట్టినట్లు’ సల్మాన్ తెలిపారు.

టైగర్ 3 తర్వాత నో ఎంట్రీ సీక్వెల్‌ చేస్తానని సల్మాన్ చెప్పాడు. టైగర్ 3లో సల్మాన్‌తో కత్రినా కైఫ్ కనిపించబోతోంది. త్వరలో వీరిద్దరూ ఢిల్లీలో 15 రోజుల షెడ్యూల్‌లో పాల్గొంటారు. నో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సల్మాన్‌తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. RRR ప్రమోషనల్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ తన చిత్రం బజరంగీ భాయిజాన్ సీక్వెల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అధికారిక ప్రకటన అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను కెవి విజేంద్ర ప్రసాద్ రాశారు. దాని సీక్వెల్ స్క్రిప్ట్ కూడా ఆయనే రాస్తున్నారని చెప్పారు.

Honey: తేనె ఎందుకు పాడవదు.. తేనె టీగలు ఎలా తయారుచేస్తాయి.. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి..?

Corona Variants: జింకల వల్ల కరోనా కొత్త వేరియంట్‌..! హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..

Covaxin: కోవాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లల్లో పెరిగిన ఇమ్యూనిటీ..! పెద్దలలో కంటే మెరుగైన ఫలితాలు..