
Urvashi Rautela: నా తప్పు ఏమున్నదబ్బా ..అనే సాంగ్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ అందాల ఊర్వశీ రౌతేలా.. హిందీ వీడియో సింగిల్స్.. ఇంటర్నేషనల్ ర్యాంప్ షోస్‌తో ఎప్పుడూ న్యూస్‌లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇవన్నీ చూశాక ఈ భామ అల్ట్రా మోడ్రన్ అని ఫిక్స్ అయిపోవడం కామన్. అఫ్ కోర్స్ అల్ట్రా మోడ్రనే అయినా.. ఊర్వశిలో మరో యాంగిల్ కూడా ఉంది. ఏంటది అనుకుంటున్నారా. వెస్ట్రన్ డాన్స్ లతో ఊపేసే ఉర్వశిలో అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కూడా దాగి ఉంది. ఎప్పుడు గ్లామర్ షోస్, ఐటమ్ సాంగ్సే కాదు.. కాస్త క్లాసికల్ టచ్ కూడా ఉంది ఊర్వశీకి. రీసెంట్‌గా తన క్లాసికల్ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ బ్యూటీ.. తన ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్ అన్న విషయాన్ని రివీల్ చేసింది. అంతేకాదు మన ట్రెడిషనల్ డాన్స్ ఫార్మ్స్‌ను కాపాడుకోవాలంటూ అప్పీల్ చేసింది ఊర్వశీ.
ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేసిన ఊర్వశీ.. త్వరలో సౌత్ స్క్రీన్ మీద కూడా సందడి చేయబోతున్నారు. ఆల్రెడీ బ్లాక్ రోస్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది ఈ హాట్ బాంబ్ దీనితోపాటు ప్యారలల్‌గా ఓ తమిళ సినిమా కూడా చేస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :