Urfi Javed: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బోల్డ్ బ్యూటీ! వీడియో వైరల్.. చివరకు..
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కొత్త ప్రయాణం ప్రారంభించనుందా? ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? లేక గతంలో లోగా మరేదైనా సినిమా ప్రమోషన్ స్టంటా? ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉర్ఫీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒక వ్యక్తి ఉర్ఫీ వేలికి ఉంగరం తొడుగుతూ కనిపించాడు. ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ కావడంతో ఉర్ఫీ వ్యక్తిగత జీవితంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఉర్ఫీ రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకుందా? అసలు ఆ అబ్బాయి ఎవరు? లేదా ప్రమోషన్ కోసమే ఇలా స్టంట్స్ చేస్తుందా? అని నెటిజన్లు భిన్న రకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఉర్ఫీ ఫోటోలు చూసిన తర్వాత , చాలామంది ఆమె కొత్త ప్రయాణం ప్రారంభించబోతోందని అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదు. ఉర్ఫీ జావేద్ త్వరలో కొత్త OTT షో ద్వారా అభిమానులను పలకరించనుంది. దీని కోసమే ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఉర్ఫీ ‘ప్రేమించడం అంత సులభం కాదు, మోసం చేసే ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి, మీరు దానిని ఆపాలి…’ అనే క్యాప్షన్‌లో చెప్పింది. అంతేకాకుండా, ఉర్ఫీ #EngagedRokaYaDhoka అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. ఈ షో శుక్రవారం ( ఫిబ్రవరి 14) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. అంటే వీడియోలో కనిపిస్తున్న నిశ్చితార్థం ఆ షో ఎపిసోడ్ అని అర్థం.
ఇక ఈ వీడియోలో ఉర్ఫీ వేలికి ఉంగరం తొడుగుతున్నది మరెవరో కాదు ప్రముఖ హాస్యనటుడు హర్ష్ గుజ్రాల్. ఉర్ఫీ మరియు హర్ష్ కలిసి ఈ షోను హోస్ట్ చేస్తుననారు. ఉర్ఫీ గురించి చెప్పాలంటే, ఆమె ఒక మోడల్, నటి, అలాగే సోషల్ మీడియా సంచలనం కూడా. ఉర్ఫీ తన బోల్డ్ ఫ్యాషన్, స్టేట్‌మెంట్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఉర్ఫీ అనేక సీరియల్స్‌లో కూడా నటించింది. ‘బడే భయ్యా కి దుల్హానియా’, ‘మేరీ దుర్గా’, ‘బేపనా’ మరియు ‘కసౌతి జిందగీ కే’ తదితర సీరియల్స్ లో ఈ బోల్డ్ బ్యూటీ నటించింది. ఇక బిగ్ బాస్ లోనూ సందడి చేసింది.
ముందు ఇలా..
View this post on Instagram
ఉర్ఫీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. నెట్టింట ఆమె అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. అయితే పలు సార్లు ఉర్ఫీ జావేద్ షేర్ చేసిన పోస్టులు, వీడియోలు వివాదాస్పదమయ్యాయి.
ఓటీటీ షో కోసమా? ఇదంతా?
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .