AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Actor Vivek Oberoi: వీడియో షేర్ చేసిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒవేరాయ్.. జరిమానా విధించి ఈ-చలాన్‌ను ఇంటికి పంపిన పోలీసులు..

Bollywood Actor Vivek Oberoi: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు..

Bollywood Actor Vivek Oberoi: వీడియో షేర్ చేసిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒవేరాయ్.. జరిమానా విధించి ఈ-చలాన్‌ను ఇంటికి పంపిన పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Feb 20, 2021 | 12:18 PM

Share

Bollywood Actor Vivek Oberoi: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్. ఆ చిత్రం తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే.. వివేక్ ఒబేరాయ్ తాజాగా ఓ వివాదం చిక్కుకున్నాడు. వివేక్ ఒబేరాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోతో పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. అసలేం జరిగిందంటే.. వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ ఒబేరాయ్.. తన భార్యతో కలిసి హార్లే డేవిడ్సన్ బైక్‌పై రైడింగ్‌కు వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియోను వివేక్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘లవ్లీ వాలంటైన్స్ డే రోజున ఈ రైడింగ్ చాలా అద్భుతంగా ఉంది’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే, ఈ పోస్ట్ కాస్తా వైరల్‌ అయ్యింది. అదే సమయంలో వివాదాస్పదం కూడా అయ్యింది.

బైక్ డ్రైవ్ చేస్తున్న వివేక్ హెల్మెట్ ధరించకపోగా.. మాస్క్ కూడా పెట్టుకోలేదు. దాంతో పలువురు సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు వివేక్ తీరును తప్పు పడుతున్నారు. ఒబేరాయ్ మాస్క్ ధరించకుండా కోవిడ్ నిబంధనలను ఉల్లంగించడమే కాకుండా.. హెల్మెట్ ధరించుకుండా ట్రాఫిక్ నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపిస్తూ వివేక్ ఒవేరాయ్‌పై సామాజిక కార్యకర్త మీను వర్గీస్ మహారాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్‌ ముఖ్‌, రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన పోలీసు అధికారులు వివేక్‌కు రూ. 500 జరిమానా విధిస్తూ ఈ చలాన్‌ను పంపించారు.

ఇదిలాఉంటే.. వివేక్ చేసిన పోస్ట్‌పై అతని అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు అతని చర్యను విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం వివేక్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోసారి బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివేక్ ఒక సెలబ్రిటీ అని, ఇలాంటి విషయాల్లో ఆయన జాగ్రత్తగా ఉండాలని హితవుచెప్పారు పలువరు నెటిజన్లు. ‘హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం చాలా తప్పు. ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో ద్వారా మీరు ఇచ్చిన సందేశం మంచిది కాదు.’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కాగా, వివేక్ ఒబేరాయ్ మంచి నటుడే కాదు.. మంచి సామాజిక వేత్త కూడా. అనేక సామాజిక కార్యక్రమాల్లో వివేక్ ఒబేరాయ్ పాల్గొంటుంటారు. ఎంతో మందికి ఆసరాగా కూడా నిలిచారు. తాజాగా గ్రామాల్లోని విద్యార్థులకు అండగా నిలవాలని వివేక్ ఒబేరాయ్ నిశ్చయించుకున్నాడు. నీట్, జేఈఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న గ్రామీణ విద్యార్థులకు స్కాలర్ షిప్‌గా అందించేందుకు రూ. 16 కోట్లు కేటాయించాడు.

Vivek Oberoi Tweet:

Also read:

తెలంగాణలో షర్మిల అడుగులపై సర్వత్రా ఆసక్తి, పక్కాప్లానింగ్‌తో వరుస భేటీలు.. జోరుగా కొత్త పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్

Rashmika: ఆ వార్తలు నిజం కావాలని కల కంటోన్న రష్మిక.. టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బ్యూటీ..