AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘మీరు గ్రేట్ సార్’.. కుల, మత ప్రస్తావన లేకుండా స్టార్ హీరో కుమారుడి బర్త్ సర్టిఫికెట్.. ఎవరో తెలుసా?

బర్త్‌ సర్టిఫికేట్స్‌లో కుల రహిత, మత రహిత కాలాన్ని పొందు పరచాలని కొన్నేళ్ల క్రితం తెలంగాణ హైకోర్ట్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కూడా. అయితే దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఒక స్టార్ హీరో మాత్రం దీనిని ఆచరించాడు.

Tollywood: 'మీరు గ్రేట్ సార్'.. కుల, మత ప్రస్తావన లేకుండా స్టార్ హీరో కుమారుడి బర్త్ సర్టిఫికెట్.. ఎవరో తెలుసా?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 01, 2025 | 8:47 PM

Share

సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో ఇతను కూడా ఒకడు. రెగ్యులర్, కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు తీస్తుంటాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. అందుకే హీరోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నటుడి నుంచి సినిమా వచ్చిందంటే అందులో ఏదో కచ్చితంగా కొత్త దనం ఉందని సినీ అభిమానులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే సూపర్ హిట్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు మరోసారి వార్తలో నిలిచాడు. నటుడు గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ లో (రిలీజియన్) కాలమ్ ను ఖాళీగా వదిలేశాననన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మత ప్రస్తావన లేకుండానే తన కుమారుడికి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిందన్నాడు. దీంతో ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ అభిమానులు, నెటిజన్లు హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గ్రేట్ సార్అంటూ కితాబిస్తున్నారు. ఇంతకీ అభిమానుల చేత చప్పట్లు కొట్టించుకుంటోన్న హీరో మరెవరో కాదు 12th ఫెయిల్ మూవీ హీరో విక్రాంత్ మస్సే.

ఇవి కూడా చదవండి

నటి రియా చక్రవర్తి హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌కి విక్రాంత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తాను దేవుడిని నమ్ముతానని, అన్ని మతాలను సమానంగా చూస్తానన్నాడు. అదే సమయంలో తన కొడుకు బర్త్ సర్టిఫికెట్లో రిలీజియన్ కాలమ్ ఖాళీగా ఉండటానికి కారణాన్ని వివరించాడు.

భార్య, కుమారుడితో విక్రాంత్ మస్సే..

మతం అనేది వ్యక్తిగత ఎంపిక అని నేను భావిస్తున్నాను. నాకు అది ఒక జీవన విధానం. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఎంచుకునే హక్కు ఉంది. నా ఇంట్లో అన్ని రకాల మతాల వారు ఉన్నారు. నేను ఇంట్లో పూజలు చేస్తాను. గురుద్వారాకు వెళ్తాను. దర్గాకు వెళ్తాను. వీటన్నింటిలోనూ నాకు మనశ్శాంతి లభిస్తుంది. నా కొడుకు బర్త్ సర్టిఫికెట్ లో రిలీజియన్ (మతం) కాలమ్‌ను ఖాళీగా ఉంచాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అతని జనన ధృవీకరణ పత్రం వచ్చింది. అందులో మతం గురించి ప్రస్తావించలేదు. అంటే, ప్రభుత్వం రిలీజియన్ రాయమని మీకు చెప్పడం లేదు. అది మీ ఇష్టం. నా కొడుకు ఎవరినైనా మతం లేదా కులం ఆధారంగా చూసినప్పుడు నాకు బాధగా ఉంటుంది. నేను అతన్ని అలా పెంచను. పెంచలేను” అని విక్రాంత్ మాసి అన్నారు.

కాగా విక్రాంత్ మస్సే కుటుంబం అన్ని మతాలను ఆచరిస్తుంది. విక్రాంత్ తండ్రి క్రిస్టియన్, తల్లి సిక్కు. ఇక విక్రాంత్ మస్సే సోదరుడు 17 సంవత్సరాల వయసులోనే ఇస్లాం మతంలోకి మారాడు. విక్రాంత్ మాసి రాజ్‌పుత్ ఠాకూర్ కుటుంబానికి చెందిన శీతల్‌ను వివాహం చేసుకున్నాడు. అందువలన వారి ఇంట్లో అన్ని ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..