Shah Rukh Khan: జెట్ స్పీడ్‌లో కింగ్ ఖాన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షారుక్ బిజీ బిజీ
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Shah Rukh Khan) సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్(Shah Rukh Khan) సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్. అయితే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు షారుక్. అయితే షారుక్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే షారుక్ ఇప్పుడు ఏకంగా 9 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నడని తెలుస్తుంది. వీటిలో మెయిన్ హీరోగా కొన్ని నటిస్తుండగా మరికొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ప్రస్తుతం షారుక్ నటిస్తున్న సినిమా పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొనే స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.
అలాగే ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వలో ఓ సినిమా చేయనున్నాడు షారుక్. ఈ సినిమాలో నాయన తార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అదేవిధంగా రాజ్ కుమార్ హిరాణీతో ఓ సినిమా కమిట్ అయ్యాడు షారుక్. వీటితోపాటు..అమీర్ ఖాన్ .. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అతిథిగా కనిపించనున్నాడట. అమీర్ ఖాన్- కరీనా కపూర్ నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా మూవీలో షారుక్ గెస్ట్ రోల్ లో ఆకట్టుకోనున్నాడట. అదేవిధంగా సల్మాన్ నటిస్తున్న టైగర్ 3 లో చిన్న పాత్రలో నటిస్తున్నాడట కింగ్ ఖాన్. అలాగే అలియా భట్ రణబీర్ కపూర్ నటిస్తున్న బ్రహ్మస్త్ర సినిమాలో సైన్టిస్ట్ గా షారుక్ కనిపించనున్నాడట. ఇక మాధవన్ నటిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్ S. నంబి నారాయణన్ బయోపిక్ లోనూ షారుక్ గెస్ట్ గా కనిపించనుండట. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలోనూ షారుక్ ఓ సినిమా చేయనున్నాడట.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షారుక్ ఫుల్ బిజీ కానున్నాడు.