AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: కశ్మీర్‌ ఫైల్స్‌పై అరవింద్ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీలో బల్లలు చరుస్తూ ఎమ్మెల్యేల మద్దతు..

The Kashmir Files: కశ్మీరీ పండిట్లు ఊచకోత, వలసల నేపథ్యంలో వివేక్‌ అగ్రహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Arvind Kejriwal: కశ్మీర్‌ ఫైల్స్‌పై అరవింద్ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీలో బల్లలు చరుస్తూ  ఎమ్మెల్యేల మద్దతు..
Aravind Kejriwal
Basha Shek
| Edited By: |

Updated on: Mar 25, 2022 | 9:59 AM

Share

The Kashmir Files: కశ్మీరీ పండిట్లు ఊచకోత, వలసల నేపథ్యంలో వివేక్‌ అగ్రహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని చిత్రం ఇప్పుడు సుమారు రూ.200 కోట్ల దాకా వసూలు చేసిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నుంచి పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలు కశ్మీర్‌ ఫైల్స్‌కు (The Kashmir Files) వినోదపు పన్ను మినహాయింపు కల్పిస్తే ..మరికొన్ని రాష్ట్రాలు ఈ చిత్రం చూడాలని ఉద్యోగులు, పోలీసులకు సెలవులు కూడా ఇచ్చారు. ఇదే సమయంలో రాజకీయంగా ఈ చిత్రంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇది కేవలం రాజకీయా ప్రయోజనాల కోసం తీసిన చిత్రమంటూ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ Arvind Kejriwal కశ్మీర్ ఫైల్స్‌ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఢిల్లీ న‌గ‌ర ప‌రిధిలోని సినిమా హాళ్లలో ప్రదర్శిస్తోన్న ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోదపు ప‌న్ను రాయితీ క‌ల్పించాల‌ని కోరారు. దీనిపై స్పందించిన అర‌వింద్ కేజ్రీవాల్‌ కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారన్న ఆయన.. ఈ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుంది. ఉచితంగా చూడవచ్చు కదా? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ‘కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. బీజేపీ వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పన్ను మినహాయింపు ఇవ్వడం కాదు ..వీలైతే ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయమని దర్శకుడికి చెప్పండి. దీంతో ప్రజలందరికీ ఈ సినిమా ఉచితంగా అందుబాటులో ఉంటుంది’ అని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. కాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఆప్‌ ఎమ్మె్ల్యేలు చాలాసేపు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.

Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు

Viral Video: మాతృ ప్రేమ అంటే ఇదే.. బిడ్డకు స్నానం చేయించిన కోతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు