Viral Video: మాతృ ప్రేమ అంటే ఇదే.. బిడ్డకు స్నానం చేయించిన కోతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Viral Video: చిన్నతనంలో చాలా మంది పిల్లలు స్నానానికి దూరంగా ఉంటారు. తల్లి స్నానం చేయిస్తుందంటే చాలు పిల్లల ఎడుపులు, పెడ బొబ్బలు...

Viral Video: మాతృ ప్రేమ అంటే ఇదే..  బిడ్డకు స్నానం చేయించిన కోతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Follow us

|

Updated on: Mar 24, 2022 | 10:21 PM

Viral Video: చిన్నతనంలో చాలా మంది పిల్లలు స్నానానికి దూరంగా ఉంటారు. తల్లి స్నానం చేయిస్తుందంటే చాలు పిల్లల ఎడుపులు, పెడ బొబ్బలు. స్నానం చేయడానికి ఇష్టపడే పిల్లలు ఎవరూ ఉండరు. అయితే ఇది మనుషులకే కాదు జంతువులలోనూ జరుగుతుంది. జంతువుల లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా ఫన్నీ వీడియోలు ప్రజల హృదయాలకు కదిలిస్తుంటాయి. ముఖ్యంగా తల్లీ బిడ్డల ప్రేమను తెలిపే వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులకు బాగా నచ్చుతున్నాయి . ఏ తల్లి అయినా తన కంటే తన బిడ్డ మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది.

ఏ ఆపద వచ్చినా తన ప్రాణాలు లెక్క చేయకుండా బిడ్డ ప్రాణాలను సైతం కాపాడుతుంది. అదే తల్లి ప్రేమ. బిడ్డలపై తల్లికి ఉండే ప్రేమ ఒక మనుషుల మధ్యనే కాదు.. జంతువుల్లోనే ఉంటుందని ఈ వీడియో ద్వారా నిరూపితమవుతోంది. ఇటీవలి కాలంలో కూడా అలాంటిదే మనం చూస్తున్నాం. ఇందులో ఒక తల్లి తన బిడ్డను బలవంతంగా ఒడిలో పెట్టుకుని స్నానం చేయిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో కోతి (Monkey) తన బిడ్డ మెడ, చేతిని పట్టుకుని స్నానం చేయడానికి నీటిలో ముంచినట్లు మీరు చూడవచ్చు.

మనుషుల్లాగే తల్లి కోత తన బిడ్డను మెడను శుభ్రం చేసుకుంటుంది. కొన్నిసార్లు కడుపులో నీరు పోస్తుంది. మధ్యమధ్యలో పారిపోవాలని ప్రయత్నించినా బిడ్డ కోతిని హడావుడిగా పట్టుకుని తిరిగి నీళ్లలో పడేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే మన ఇళ్లలోని తల్లులు తమ పిల్లలకు స్నానం చేయించే దృశ్యం గుర్తుకు వస్తుంటుంది. మాతృ ప్రేమ అంటే ఇదే.. బిడ్డకు స్నానం చేయిస్తున్న కోతి వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అదే విధంగా, జంతువులు కూడా తమ పిల్లల పరిశుభ్రతపై చాలా శ్రద్ధ చూపుతాయని ఈ వీడియో ద్వారా తెలిసిపోతుంది.

ఈ వీడియోను IFS డాక్టర్ సామ్రాట్ గౌడ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇది కేవలం కొన్ని గంటల్లో వేల సంఖ్యలో వీక్షించారు. అలాగే లైక్‌ల మీద లైక్‌లు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తల్లి స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడింది !! నవ్వులు పూయిస్తున్న అమ్మాయి వీడియో

Viral Video: మూడు చిరుతల మధ్య .. చిరుతను కౌగలించుకుని హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న వ్యక్తి