AR Rahman: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్‌కు మద్దతుగా ఏ ఆర్ రెహమాన్ ఏం చేయనున్నారంటే?

త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. భారత సంతతికి చెందిన కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది హాలీవుడ్ వ్యక్తులు కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఎలోన్ మస్క్‌తో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు ట్రంప్‌కు మద్దతు పలికారు. అమెరికాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న భారతీయుడు ఏఆర్ రెహమాన్, కమలా హారిస్‌కు మద్దతుగా..

AR Rahman: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్‌కు మద్దతుగా ఏ ఆర్ రెహమాన్ ఏం చేయనున్నారంటే?
Kamala Harris, AR Rahman
Follow us

|

Updated on: Oct 13, 2024 | 7:55 PM

భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు వివిధ పార్టీలు ప్రచారంలో భాగంగా పాటలను విడుదల చేస్తుంటాయి. ఏవైనా హిట్ పాటలను ఎంచుకుని, దాని లిరిక్స్ ను మార్చి సాంగ్స్‌ను రూపొందిస్తుంటాయి. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఈ పాటలు చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి. కొన్ని పాటలు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని పాటలు ప్రత్యర్థులను విమర్శించేలా కూడా ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. భారత సంతతికి చెందిన కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది హాలీవుడ్ వ్యక్తులు కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఎలోన్ మస్క్‌తో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు ట్రంప్‌కు మద్దతు పలికారు. అమెరికాలో విపరీతమైన పాపులారిటీ ఉన్న భారతీయుడు ఏఆర్ రెహమాన్, కమలా హారిస్‌కు మద్దతుగా ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేయనున్నారు.

ఏ ఆర్ రెహమాన్ ఇప్పటికే కమలా హారిస్ కోసం ఒక మ్యూజిక్ వీడియోను రికార్డ్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియో నిడివి 30 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఈ మ్యూజిక్ వీడియోలో చాలా పాటలు ఉన్నాయి. ఈ మ్యూజిక్ వీడియో అమెరికా కాలమానం ప్రకారం అక్టోబర్ 13 రాత్రి (భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 14 ఉదయం) విడుదల కానుంది. కమలా హారిస్ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న సంస్థల్లో ఒకటైన ఆసియా-అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ విక్టరీ ఫండ్ (AAPI), AR రెహమాన్ మ్యూజిక్ వీడియో నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వీడియోను అతని యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నారు.

ఈ విషయమై ఏఏపీఐ అధ్యక్షుడు శేఖర్ నరసింహ మాట్లాడుతూ.. ‘ఈ మ్యూజిక్ వీడియో ద్వారా అమెరికా ప్రగతికి, శాంతికి, ప్రాతినిధ్యానికి అనుకూలంగా నిలబడే నాయకులు, కళాకారులు తమ గళాన్ని వినిపించారు. ‘ఇది పాట మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. సురక్షితమైన, అందమైన భవిష్యత్తు కోసం ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేయమని మా సంఘాలను ప్రోత్సహించడానికి రూపొందించిన వీడియో ఇది. ఈ మ్యూజిక్ వీడియోలో, కమలా హారిస్ సందేశం, ఆమె లక్ష్యం, ఉద్దేశాలతో పాటు రెహమాన్ హిట్ పాటలు కూడా ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే ప్రపంచ స్థాయి పాప్ స్టార్ బియాన్స్ ఇప్పటికే కమలా హారిస్ కోసం ఓ పాటను రూపొందించారు. కమలా హారిస్ ప్రచారానికి బియాన్స్ పాట ‘ఫ్రీడమ్’ థీమ్ సాంగ్. ఈ పాటలో ప్రముఖ గాయకుడు కేండ్రిక్ లామర్ కూడా గొంతు వినిపించారు. అంతే కాదు ప్రముఖ గాయకుడు జాన్ మెలెన్‌క్యాప్ కమలా హారిస్‌కి ‘స్మాల్ టౌన్’ అనే పాటను అందించారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..