Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?

Alia Bhatt Ranbir Kapoor Net Worth: ఏప్రిల్ 14న కపూర్‌తోపాటు భట్ కుటుంబాలకు చిరస్మరణీయమైనది. మొత్తానికి, ప్రేమలో ఉన్న అలియా, రణబీర్ ఒక్కటయ్యారు. ఈమేరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?
Alia Bhatt Ranbir Kapoor
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2022 | 1:35 PM

ఏప్రిల్ 14న కపూర్‌తోపాటు భట్ కుటుంబాలకు చిరస్మరణీయమైన రోజుగా మారింది. మొత్తానికి, ప్రేమలో ఉన్న అలియా, రణబీర్(Alia Ranbir Wedding) ఒక్కటయ్యారు. ఈమేరకు వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అలియా(Alia Bhatt) తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన వివాహ ఫోటోలను కూడా పంచుకుంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు, ప్రతి ఒక్కరూ అలియా-రణబీర్‌(Ranbir Kapoor)లకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే, ప్రస్తుతం అందరి చూపు వీరి ఆస్తులపై పడింది. పెళ్లి తర్వాత వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. రణ్‌బీర్‌, అలియాల ఆస్తుల విలువ రూ.839 కోట్లుగా మారినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ ఆస్తులు..

మీడియా నివేదికల ప్రకారం, రణబీర్ కపూర్ నికర విలువ దాదాపు రూ. 330 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. వేక్ అప్ సిద్, రాజ్‌నీతి, రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, రాక్‌స్టార్, యే జవానీ హై దీవానీ, బర్ఫీ, తమాషా, సంజు, మరెన్నో చిత్రాలకు విమర్శకుల నుంచి సైతం రణబీర్ కపూర్ ప్రశంసలు పొందాడు. దీంతో ఇలాంటి విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత, రణబీర్ కపూర్ తన ఫీజు పెంచినట్లు సమాచారం. ఈ నటుడు ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ.50 కోట్లు తీసుకుంటాడని తెలుస్తోంది. ఇది కాకుండా, రణబీర్ తాను చేసే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. OPPO, , Coca-Cola, Tata AIG, Oreo వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు కూడా రణబీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక్క బ్రాండ్ షూట్‌ల కోసం దాదాపు రూ.6 కోట్లు తీసుకుంటాడని తెలుస్తుంది.

అలియా భట్ ఆస్తులు..

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహేష్ భట్ చిన్న కుమార్తె అలియా.. పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది. బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లను అందించినందున నిర్మాతల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయగల కొద్దిమంది మహిళా తారలలో అలియా ఒకరు. డఫ్ అండ్ ఫెల్ప్స్ నివేదిక ప్రకారం, అలియా భట్ 2021లో యూఎస్‌డీ 68.1 మిలియన్ల (రూ. 517 కోట్లకు పైగా) విలువను కలిగి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2021లో అత్యధిక విలువ కలిగిన టాప్-5 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా బాలీవుడ్ తారగా అలియా నిలిచింది. Aurelia, ​​Duroflex, Cornetto, Flipkart, Lay’s, Frooti, Manyavar, Cadbury, Blenders Pride లాంటి మరెన్నో బ్రాండ్‌లకు అలియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ప్రమోషనల్ కంటెంట్ కోసం అలియా రూ. 2 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.

అలియా ముంబైలోని జుహులో తన విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ఇంటీరియర్స్‌ని రిచా బహ్ల్ చేశారు. ఆమె తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి మరికొన్ని ఆస్తులను కలిగి ఉంది. వీరి ఆస్తులు ముంబైలోని ప్రధాన ప్రదేశాలలో ఉన్నాయి. అలియా తన ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ను 2021లో ప్రారంభించింది. ఆఫీస్ స్పేస్ 2800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అలియా వద్ద ఆడి క్యూ7, ఆడి క్యూ5, ఆడి క్యూ6, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ లాంటి ఇతర విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. అలియా తన వ్యక్తిగత వ్యానిటీ వ్యాన్‌ను కూడా కలిగి ఉంది.

Also Read: KGF Chapter 2: ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు.. కేజీఎఫ్ 2 ఎలివేషన్స్ వెనక 19 ఏళ్ల కుర్రాడు..

Alia-Ranbir Wedding: పెళ్లి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆలియా రణబీర్ జంట.. సంతోషంలో లవ్ బర్డ్స్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే