- Telugu News Photo Gallery Cinema photos Bollywood actor ranbir kapoor took alia bhatt in front of the media after marriage pictures goes viral
Alia-Ranbir Wedding: పెళ్లి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆలియా రణబీర్ జంట.. సంతోషంలో లవ్ బర్డ్స్..
బాలీవుడ్ లవ్ బర్డ్ ఆలియా భట్.. రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు.
Updated on: Apr 15, 2022 | 12:13 PM

బాలీవుడ్ లవ్ బర్డ్ ఆలియా భట్.. రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒకటయ్యారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. నిన్న ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఆలియా రణబీర్.. ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ సమయంలో వీరిద్ధరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్ధరు ప్రేమికులుగా మారారు.

ఇరువురి కుటుంబసభ్యులు, అత్యంత ముఖ్యమైన సన్నిహితుల మధ్య ఆలియా, రణబీర్ ల వివాహం జరిగింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

పెళ్లి తర్వాత ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు రణబీర్, ఆలియా. సినీ జర్నలిస్టులతోపాటు.. ప్రేక్షకులు.. అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.

మీడియా ముందు నుంచి ఇంట్లోకి తిరిగి వెళ్తున్న సమయంలో రణబీర్ ఆలియాను ఎత్తుకుని తీసుకెళ్లారు. రణబీర్ ప్రవర్తనకు ఆలియా ఒక్కసారిగా షాకయ్యింది.




