Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..

దేవదాసు చిత్రంతో కుర్రకారు మనసులు గెల్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). ఆతర్వాత వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..
Ileana D'cruz
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2022 | 4:30 PM

దేవదాసు చిత్రంతో కుర్రకారు మనసులు గెల్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). ఆతర్వాత వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది. చాలా ఏళ్లపాటు టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన అమర్‌ అక్బర్‌ ఆంటోనీతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా ప్లాఫ్‌ కావడంతో ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలోనే ఉంటూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటూ నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. వీటన్నిటినీ పక్కన పెడితే గతంలో బాడీ షేమింగ్‌ కామెంట్లతో ఇబ్బంది పడ్డానని చెబుతూ వార్తల్లో నిలిచింది. అదేవిధంగా కొన్ని శారీరక సమస్యలతో సతమతమయ్యానని, ఒకానొక సమయంలో ఆత్మహత్య (Suicidal thoughts) కూడా చేసుకోవాలనుకుందని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన తన ఆత్మహత్య ఆలోచనల వెనక అసలు విషయం బయటపెట్టేసింది.

వాటిని ముడిపెట్టడం నచ్చలేదు!

‘నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ అది బాడీ షేమింగ్‌ వల్ల మాత్రం కాదు. 12 ఏళ్ల వయసు నుంచే నాకు కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయితే శరీరాకృతి విషయంలో అవహేళన ఎదుర్కొవడం వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటిని చూసిన నా ఫ్రెండ్స్‌ నాకు ఫోన్‌ చేసి.. ఇదంతా వాస్తవమేనా? అని అడిగారు. సందేశాలు పంపారు. దీంతో నాకు చాలా చిరాకేసింది. శారీరక సమస్యల వల్ల నేను ఏ రోజూ చనిపోవాలనుకోలేదు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లాను. మానసిక కుంగుబాటుతో చనిపోవాలనుకున్నా. తీవ్ర నిరాశ, నిస్పృహల వల్ల ఆ క్షణంలో అలా అనిపించింది. అయితే ఎలాంటి సంబంధంలేని రెండు విషయాలను ముడిపెడుతూ వార్తలుగా ఇవ్వడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది ఇల్లీ బేబీ. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా అభిషేక్‌ బచ్చన్‌ సరసన బిగ్‌బుల్‌ అనే సినిమాలో నటించింది ఈ అందాల తార. ప్రస్తుతం హిందీలో ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తోంది.

Also Read: PM Modi: ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్.. రానున్న పదేళ్లలో రికార్డ్ స్థాయిలో కొత్త వైద్యులు .. ప్రధాని మోడీ

Godfather: మెగాస్టార్‌ను ఇరుకున పడేసే పాత్రలో డైనమిక్ డైరెక్టర్.. ‘గాడ్ ఫాదర్‌’లో పూరీ ఇలా..

Rajasthan: రాజస్థాన్‌లో మిస్టరీ వ్యాధి.. ఏడుగురు చిన్నారులు మృతి.. నమూనాలు సేకరిస్తున్న వైద్య బృందాలు..