Godfather: మెగాస్టార్‌ను ఇరుకున పడేసే పాత్రలో డైనమిక్ డైరెక్టర్.. ‘గాడ్ ఫాదర్‌’లో పూరీ ఇలా..

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )లైనప్ చేసిన సినిమాలు వరసగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. నో గ్యాప్ అంటూ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు చిరు.

Godfather: మెగాస్టార్‌ను ఇరుకున పడేసే పాత్రలో డైనమిక్ డైరెక్టర్.. 'గాడ్ ఫాదర్‌'లో పూరీ ఇలా..
Megastar Chiranjeevi Puri J
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 15, 2022 | 4:10 PM

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )లైనప్ చేసిన సినిమాలు వరసగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.. నో గ్యాప్ అంటూ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు చిరు. త్వరలోనే ఆచార్యను ప్రేక్షకుల ముందు పెట్టేసి.. మిగిలిన ప్రాజెక్ట్స్ ను చకచకా పూర్తి చేయనున్నారు. ఆచార్య తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మూవీ గాడ్ ఫాదర్(Godfather). మలయాళ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తమిళ్ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. వీలైనంత ఫాస్ట్ గా ఈ సినిమాను కంప్లీట్ చేసి.. నెక్స్ట్ మెహర్ రమేష్ భోళాశంకర్ ను పట్టాలెక్కించనున్నారు చిరు. ఇక గాడ్ ఫాదర్ విషయానికొస్తే ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను రంగంలోకి దింపారు. ఇటీవలే భాయిజాన్ పార్ట్ ను కంప్లీట్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా.. ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ను సీన్ లోకి తీసుకొచ్చారు.

పూరీతో ఓ పవర్ ఫుల్ రోల్ చేయించనున్నారట ఈ సినిమాలో.. ఇటీవలే సెట్ లో అడుగు పెట్టిన పూరీకి మెగాస్టార్ వెల్కమ్ చెప్పారు. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు చిరు సినిమాలో పూరి ఎలా కనిపించనున్నారన్నది హాట్ టాపిక్ ఆ మారింది. తాజాగా దీనికి సంబధించిన వార్త ఒకటి ఫిలిం సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే గాడ్ ఫాదర్ మూవీలో పూరి మెగాస్టార్ ను ఇరుకున పెట్టె పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాలో పూరిజగన్నాథ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ పాత్ర కారణంగా మెగాస్టార్ సినిమాలో ఇరుకున పడతారని తెలుస్తుంది. మలయాళం ఒరిజినల్ లో ఈ పాత్రను పృధ్విరాజ్ అన్న ఇంద్రజిత్ పోషించాడు. మరి ఈవార్తలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!