Pooja Hegde: ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న బుట్టబొమ్మ.. రంగస్థలం తర్వాత మరోసారి
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న భామ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు పూజాహెగ్డే(Pooja Hegde). కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ బాషల్లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న భామ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు పూజాహెగ్డే(Pooja Hegde). కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ బాషల్లోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. స్టార్ హీరోల సినిమాలు అంటే ముందు ఈ అమ్మడి పేరునే ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలే ఈ బ్యూటీ రాధేశ్యామ్(Radhe Shyam), బీస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఆచార్య సినిమాతో ఆకట్టుకోనుంది. అయితే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది ఈ చిన్నది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో జిగేలు రాణిగా ఒక ఊపుఊపేసింది పూజ. ఈ సినిమాలో పూజ స్పెషల్ సాంగ్ వున్న ఆఫ్ ది హైలైట్‌గా నిలిచిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి స్పెషల్ సాంగ్ లో నర్తించేందుకు రెడీ అయ్యిందని తెలుస్తుంది.
సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్ 3. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ ఓ స్పషల్ సాంగ్ లో అందాల భామ పూజ హెగ్డే నటించనుందని తెలుస్తుంది. దేవీ శ్రీ సంగీత సారథ్యంలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో ఈ బుట్టబొమ్మ స్టెప్పులేయనుందట. ఈ పాట సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా ఉండనుందని అంటున్నారు చిత్రయూనిట్. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.