Priyanka Chopra: ‘నేనెం చేసినా తప్పులు వెతుకుతుంటే ఎలా’.. ట్రోలింగ్స్ పై ప్రియాంక చోప్రా కామెంట్స్..
ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ విషయంలో ఎంతో మద్దతుగా మాట్లాడిన ప్రియాంక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను తమిళ చిత్రం అంటూ చేసిన వ్యాఖ్యలు నెజిటన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఆ విషయంపై స్పందించింది ప్రియాంక.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఆనతి కాలంలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించేందుకు కష్టపడుతున్నారు. అయితే ఇటీవల కొద్ది నెలలుగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్స్ భారిన పడుతుంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ విషయంలో ఎంతో మద్దతుగా మాట్లాడిన ప్రియాంక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను తమిళ చిత్రం అంటూ చేసిన వ్యాఖ్యలు నెజిటన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఆ విషయంపై స్పందించింది ప్రియాంక. తాను చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడం కొందరికి ఇష్టమని తెలిపింది. మనం జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తుంటే ప్రోత్సహించేవాళ్లే కాదు.. కిందకు లాగడానికి ఎదురుచూసే వాళ్లూ ఎక్కువగానే ఉంటారని చెప్పుకొచ్చింది.
“కొందరు నేను ఏది చేసినా అందులో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటున్నారు. బహుశా అది వాళ్లకు ఆనందం కలిగించి ఉండొచ్చు. అందుకే ఇవన్నీ పట్టించుకోకపోయినా కాస్త జాగ్రత్తగా అయితే ఉంటాను. ఎందుకంటే నాకంటూ ఇప్పుడు ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది. అభిమానులున్నారు. ప్రస్తుతం నా దృష్టంతా వాళ్లమీదే పెట్టాను. మనం ఉన్నత శిఖరాలను చేరుతున్నప్పుడు మనల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నాకు అదే సమయంలో నా కుటుంబం, స్నేహితులు, అభిమానుల నుంచి నాకు చాలా ప్రేమ, మద్దతు ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చింది పీసీ.
ప్రియాంక చోప్రా సిటాడెల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 28న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. దీనికి జేమ్స్ సి స్ట్రౌస్ వ్రాసి దర్శకత్వం వహించారు. ఇందులో సామ్ హ్యూగన్, రస్సెల్ టోవీ, సెలిన్ డియోన్ కీలకపాత్రలలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.