Maharashtra: గదిలో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్‌.. ఏకంగా పెద్ద బిజినెస్సే పెట్టేసింది..

ఫస్ట్‌ సీరియల్స్‌లో నటి. తర్వాత జీవితంలో కూడా నటిగా అవతారమెత్తింది. అందమైన అమ్మాయిలకు వల వేసి గురి చూసి పట్టుకునే విద్య నేర్చుకుంది. సినిమా రంగుల కల, డబ్బుల ఆశ చూపించి వలలో వేసుకుంటుంది. మోడల్స్‌ను వ్యభిచార కూపంలోకి దింపి సర్వనాశనం చేస్తుంది. అయితే పోలీసులు స్కెచ్‌ వేసి సీన్‌ లోకి ఎంట్రీ ఇచ్చి అమ్మడి ఆట కట్టించారు.

Maharashtra: గదిలో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్‌.. ఏకంగా పెద్ద బిజినెస్సే పెట్టేసింది..
Sex Racket Busts
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2023 | 5:30 AM

ఫస్ట్‌ సీరియల్స్‌లో నటి. తర్వాత జీవితంలో కూడా నటిగా అవతారమెత్తింది. అందమైన అమ్మాయిలకు వల వేసి గురి చూసి పట్టుకునే విద్య నేర్చుకుంది. సినిమా రంగుల కల, డబ్బుల ఆశ చూపించి వలలో వేసుకుంటుంది. మోడల్స్‌ను వ్యభిచార కూపంలోకి దింపి సర్వనాశనం చేస్తుంది. అయితే పోలీసులు స్కెచ్‌ వేసి సీన్‌ లోకి ఎంట్రీ ఇచ్చి అమ్మడి ఆట కట్టించారు.

ముంబైలో వ్యభిచార రాకెట్ నడుపుతోందనే ఆరోపణలపై నటి, కాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని పోలీసులు ఇద్దరు డమ్మీ కస్టమర్లను పంపి ఆర్తి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఉమెన్ కాస్టింగ్ డైరెక్టర్ అయిన ఆర్తి మిట్టల్ వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సినిమా అవకాశాల కోసం వచ్చే అందమైన అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకుని వారికి డబ్బు, సినిమా అవకాశాలను ఆశ చూపి ఆర్తి ఈ దందా నడిపింది. అందమైన అమ్మాయిలను హోటళ్లలో ఉన్న కస్టమర్ల దగ్గరకు పంపేది. ఒక్కో అమ్మాయికి 30 నుంచి 40 వేల రూపాయలు కస్టమర్ల నుంచి వసూలు చేసే ఆర్తి.. అందులో రూ. 15వేలు మాత్రమే యువతులకు ఇచ్చి మిగతాది జేబులో వేసుకునేది.

ఇద్దరు మోడల్స్‌ని రక్షించిన పోలీసులు..

ఆర్తిపై నిఘా ఉంచిన పోలీసులు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇద్దరు కస్టమర్లను ఆమె దగ్గరికి పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారణ అయ్యాక దాడులు చేపట్టారు. పోలీసులు ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మోడల్స్‌కి డబ్బుతో ఎర..

ఈ రెయిడ్‌ను పోలీసులు వీడియా రికార్డు చేశారు. నిందితురాలు ఆర్తి మిట్టల్‌ను అరెస్ట్ చేశారు. ఆర్తి కొంత కాలంగా కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఓషివారాలోని ఆరాధనా అపార్టుమెంటులో ఉంటోంది. సినిమా ప్రాజెక్టుల పేరుతో ఆమె అందమైన మోడల్స్‌ను కలిసి వారికి డబ్బు ఆశ చూపేవారు. బలవంతంగా వ్యభిచారంలోకి మోడల్స్‌ను దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 370తో పాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్తి గతంలో అప్నాపన్‌, బదల్తే రిష్తోంకే బంధన్‌ సీరియల్స్‌లో నటించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా మూడు వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.

సో.. అమ్మాయిలు భద్రం బీకేర్‌ఫుల్‌.. సినిమా అవకాశాల పేరుతో ఇలాంటి కిలేడీలు విసిరే రంగుల వలలో చిక్కుకోకండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి