Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. నీ స్మృతిలో అంటూ ఫ్యాన్స్ నివాళులు..

Sushant Singh Rajput Birth Anniversary: ఎగసి పడిన కెరటం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఓ సామాన్యుడు బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తనకంటూ..

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. నీ స్మృతిలో అంటూ ఫ్యాన్స్ నివాళులు..
Sushant Singh Rajput Birth Anniversary
Follow us

|

Updated on: Jan 21, 2022 | 9:03 AM

Sushant Singh Rajput Birth Anniversary: ఎగసి పడిన కెరటం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఓ సామాన్యుడు బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తనకంటూ ఓ ఫేం ను సంపాదించుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా ఎదిగాడో.. నిజ జీవితంలో అన్ని వదిలేసి.. చిన్న వయసులోనే అన్నీ వదిలేసి ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. సుశాంత్ మరణవార్త బాలీవుడ్ పరిశ్రమ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ( Sushant Singh Rajput Death). సుశాంత్ మరణ వార్త మొత్తం బాలీవుడ్ పరిశ్రమను కదిలించింది. సుశాంత్ మరణించి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ సుశాంత్‌ని అభిమానులు మిస్ అవుతున్నారు. అతని జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానుల మదిలో పదిలంగా ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి నేడు. సుశాంత్ జయంతి సందర్భంగా స్నేహితులు, అభిమానులు యంగ్ హీరో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బీహార్‌లోని పాట్నాలో జనవరి 21 న 1986న జన్మించాడు. సుశాంత్ తన ‘ఎంఎస్ ధోని’ సినిమా కోసం రెడీ అవుతున్నసమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.

సుశాంత్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయిన మహి:

క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ బాలీవుడ్ లో తెరకెక్కడానికి రెడీ అవుతుంది. ధోనీ క్యారెక్టర్ లో సుశాంత్ నటించనున్నాడు. దీంతో ధోనీ గురించి తెలుసుకోవాలని సుశాంత్ కి ఉన్న క్యూరియాసిటీ తో ధోనీని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, సుశాంత్ .. మహి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నప్పుడు.. ధోనిని మూడుసార్లు కలిశాడు. ఆ సమయంలో సుశాంత్.. మొదటిసారి ధోనిని కలిసినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. ధోనీ చెప్పింది విన్నాడు. ఆ తర్వాత రెండు సార్లు సుశాంత్ మహిని కలిసినప్పుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోని కోపం తెచ్చుకున్న సందర్భం కూడా ఉంది.

ఎంఎస్ ధోని ఓ ఇంటర్యూలో సుశాంత్ గురించి.. TOIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. సుశాంత్ తనను రెండో సారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సుశాంత్ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో తాను సమాధానం చెప్పడానికి విసుగు చెందడం మొదలు పెట్టానని చెప్పారు. అయితే అప్పుడు సుశాంత్ తాను ఎక్కడికి వెళ్ళినా చాలా ఇష్టంగా నన్ను అనుసరించేవాడని.. అప్పుడు సుశాంత్ డెడికేషన్ కు ముగ్దుడినై విసుగు మానేసి.. సుశాంత్ ఎ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడం మొదలు పెట్టినల్టు చెప్పాడు. ఒకానొక సమయంలో అసలు సుశాంత్ ను అసలు ఇతను మనిషేనా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకున్న సందర్భం కూడా ఉందని చెప్పారు. ధోని ఇంకా మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ స్ఫూర్తి తనను చాలా ఆకట్టుకున్నదని.. అతని అంకితభావాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు.

34 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికిన సుశాంత్: జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ శవమై కనిపించాడు. అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి.. తన అభిమానులను శోక సంద్రంలో ముంచాడు. సుశాంత్ మరణ వార్తతో సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది.

ఇప్పటికీ సుశాంత్ మృతిపై పలు అనుమానాలు.. సమాధానం దొరకని అనేక ప్రశ్నలు తలెత్తాయి. సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులు సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా పరిగణించకుండా హత్యగా అనుమానిస్తున్నారు.

Also Read:

 కొన్ని సందర్భాల్లో అసంతృప్తి కూడా మేలే చేస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?