Pawan Kalyan: పవర్ స్టార్ హరిహర వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ స్టార్.. ఇదిగో వీడియో

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే  ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను వవిపరీతంగా ఆకట్టుకున్నాయి.

Pawan Kalyan: పవర్ స్టార్ హరిహర వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ స్టార్.. ఇదిగో వీడియో
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2022 | 12:47 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే  ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది కానీ కరోనా కారణంగా షూటింగ్ లెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణం. ఇక ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైంత స్పీడ్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా లో ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడిని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ ను ఎంపిక చేశారు క్రిష్. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బాబీ డియోల్ ఇటీవల వచ్చిన ఆశ్రమం అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పవన్ కెరీర్ లో అతంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్  భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్