Vivek Oberoi: తెలుగువారు చూపించే ప్రేమ దేశంలో ఎక్కడా దొరకదు.. వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

|

Jun 26, 2022 | 3:51 PM

Vivek Oberoi: బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నటుడు వివేక్‌ ఒబెరాయ్‌. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'కంపెనీ' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వివేక్‌ తొలి సినిమాలోనే తన నటనతో...

Vivek Oberoi: తెలుగువారు చూపించే ప్రేమ దేశంలో ఎక్కడా దొరకదు.. వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us on

Vivek Oberoi: బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నటుడు వివేక్‌ ఒబెరాయ్‌. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కంపెనీ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వివేక్‌ తొలి సినిమాలోనే తన నటనతో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా సక్సెస్‌లో వివేక్‌ నటన కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగులోనూ విడుదలవడంతో వివేక్‌ టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పుడే పరిచయమయ్యాడు. ఇక మరోసారి వర్మ దర్శకత్వంలోనే వచ్చిన ‘రక్త చరిత్ర’తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు వివేక్‌. ఇదిలా ఉంటే వివేక్‌ తాజాగా మలయాళీ సినిమా కడువాలో నటించాడు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాతో, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు వివేక్‌.

ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. ‘రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి లాంటి పవర్‌ఫుల్‌‌, అత్యద్భుతమైన రోల్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోని రియల్‌ ఫ్యాక్షనిజం తీవ్రత తెలుసుకున్నా. ఆ సినిమా విడుదలైనప్పుడు దాన్ని చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లా. సినిమాలో సాధారణ స్కూటర్‌పై నా ఎంట్రీ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌ చూసి థియేటర్‌లో ప్రేక్షకులందరూ ఈలలు వేసి.. గోల చేశారు. ఆ క్షణం వాళ్లు చూపించిన ఉత్సాహం చూస్తే ముచ్చటగా అనిపించింది. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోను. అప్పుడు అర్థమైంది.. సినిమాపట్ల తెలుగువారికి ఉన్న ప్రేమాభిమానం దేశంలో మరెక్కడా కనిపించదు’ అని చెప్పుకొచ్చాడు.

ఇక హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. మా కుటుంబంలో చాలామంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి వస్తే స్కూటర్ కాలేజీలు చుట్టూ తిరగడాలు, గండిపేట్ పిక్నిక్, ట్యాంక్ బండ్ అన్నీ గుర్తుకు వస్తాయి. నా చిత్రాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ‘కడువా’ రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్ లా ఈ సినిమా ఉంటుంది. నా కెరీర్‌లో ఫోన్ లోనే ఓకే చేసిన మూవీ లూసిఫర్. కడువా కథ కూడా పృథ్వీరాజ్ ఫోన్ లోనే చెప్పారు. కథ చెప్పినపుడు ఇదో బుల్ ఫైట్ లా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని వివేక్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..