Divvala Madhuri : వాడు అసలు అమ్మకే పుట్టలేదు.. రెచ్చిపోయిన దివ్వెల మాధురి
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో రచ్చ కంటిన్యూ అవుతుంది. హౌస్ మేట్స్ ఒకరి మీద ఒకరు నామినేషన్స్ వేస్తూ వాదనలు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఆదివారం రోజున దివ్వెల మాధురి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెల్సిందే. ఊహించని విధంగా హౌస్ నుంచి మాధురి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

దువ్వాడ మాధురి. మొన్నటివరకు వార్తల్లో నిలిచినా ఈ పేరు.. ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లోకి దువ్వాడ మాధురి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. హౌస్ లో రాక్ రచ్చ చేశారు. చిన్నదానికి పెద్ద దానికి గొడవలు పెట్టుకుంటూ మాధురి హౌస్ లో మాములు రచ్చ చేయలేదు. ఇక ఈ ఆదివారం ఎలిమినేషన్స్ లో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మొదటి రెండు వారాలు మాధురి నామినేషన్స్ లో లేదు.. ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉండటంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కానీ ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేశా.. నేను అనుకున్నాను కాబట్టే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశా అని చెప్తున్నారు.
23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!
ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాధురి పలు టీవీ ఛానల్స్ కు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో పవన్ , రీతూ మధ్య అన్ హెల్దీ రిలేషన్ ఉంది అని మీరు పాయింట్ చేశారు.. మీరు దువ్వాడ శ్రీనివాస్ తో చేసేది హెల్దీ రిలేషనా.? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కు మాధురి సీరియస్ అయ్యారు. మీకెదుకు మా గురించి అని సీరియస్ అయ్యారు మాధురి. అలాగే రీతూ చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్లే నాకు చెప్పారు.. పవన్ తో దూరంగా ఉండమని.. అలాగే రీతూ తల్లి ఏడుస్తుందని కూడా చెప్పారు.. అని చెప్పుకొచ్చింది.
అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అలాగే హౌస్ లో భరణి గారితో మీరు డాన్స్ చేశారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైపోతారా అని మీమ్స్ కూడా చాలా వచ్చాయి అని జర్నలిస్ట్ అడగ్గానే మాధురి రెచ్చిపోయింది. బుద్దిలేనోడు ఎవడో.. గడ్డితిన్న ఎదవ ఎవడో మీమ్స్ వెయ్యొచ్చు.. మీరు వెయ్యకుడదు. మీరు ఎపిసోడ్ చూశారా.? నాగార్జున డాన్స్ చేయమంటేనే నేను డాన్స్ చేశా.. మేమేమి కావాలని డాన్స్ చేయలేదు.. ఒకరినొకరు హగ్ చేసుకోలేదు.. అంటూ రెచ్చిపోయింది. అలాగే ఎవడైతే ట్రోల్ చేశాడో వాడు అమ్మకు పుట్టివుండడు.. ట్రోల్ చేసిన వాడు అమ్మకు పుట్టలేదు అంటూ నోరు పారేసుకున్నారు మాధురి. వాడు ఎవడికి పుట్టాడో కుడా తెలియదు. అంత నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదు అంటూ మాధురి సీరియస్ అయ్యారు. ఈ కామెంట్స్, అలాగే ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




