AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: బిగ్‌బాస్‌ బ్యూటీ గొప్ప మనసు.. అనాథ పిల్లల కోసం అషూ రెడ్డి ఏం చేస్తుందో తెలుసా?

అషు రెడ్డి పాదాల దగ్గర కూర్చుని వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో డైరెక్టర్‌తో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీపై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. అయితే అషురెడ్డిని తిట్టినొళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.

Ashu Reddy: బిగ్‌బాస్‌ బ్యూటీ గొప్ప మనసు.. అనాథ పిల్లల కోసం అషూ రెడ్డి ఏం చేస్తుందో తెలుసా?
Ashu Reddy
Basha Shek
|

Updated on: Dec 28, 2022 | 9:17 AM

Share

అషూ రెడ్డి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మొదట డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ టాక్‌షోతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. దీని తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది. ఈ సంగతి పక్కన పెడితే గత కొద్ది రోజులనుంచి సోషల్‌ మీడియాలో అషురెడ్డిపై విపరీతమైన ట్రోలింగ్స్‌ వస్తున్నాయి. ఇందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు ఆర్జీవీతో ఆమె చేసిన ఓ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా అషు రెడ్డి పాదాల దగ్గర కూర్చుని వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో డైరెక్టర్‌తో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీపై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు. అయితే అషురెడ్డిని తిట్టినొళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు. ఆమె దయార్థ్ర హృదయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అషూరెడ్డి తన సంపాదనలో కొత్త మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారట. ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి అనాథ పిల్లలను చదివిస్తోందట. ఇటీవల ఆ పిల్లలందరితోనే కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుందీ బిగ్ బాస్ బ్యూటీ. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది అషూరెడ్డి. అనాథ పిల్లలతో దిగిన ఫొటోలు, ఎమోషనల్‌ మూమెంట్స్‌ను పంచుకుంది.

తిట్టినొళ్లే పొగుడుతున్నారు..

‘క్రిస్మస్ రోజున నన్ను శాంటా అవ్వాలని పిల్లలు అన్నారు. గత కొన్నేళ్లుగా దేవుడు నాకు బహుమతిగా ఇచ్చిన పిల్లలను చదివిస్తూ, వారి బాధ్యతను తీసుకున్నాను. ముఖ్యంగా నేను చదివిస్తున్న పిల్లల్లో కళ్యాణి, శ్రేయ బీటెక్, డిగ్రీ పూర్తిచేయడం సంతోషంగా ఉంది. వారికి నా అభినందనలు. నా జీవితంలో మీరంతా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి ప్రేమను పొందడానికి నేను ఏం చేశానో నాకే తెలియదు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. మీరు ఎవరికైనా సాయం చేయాలని అనుకుంటే అది కచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఇతరులకు సాయం చేయడానికి ఆ భగవంతుడు మీకొక మార్గాన్ని చూపిస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనలైంది అషూ రెడ్డి. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఆర్జీవీ ఇంటర్వ్యూ తర్వాత ఆమెను దారుణంగా తిట్టినొట్టే ఇప్పుడు బిగ్‌బాస్ బ్యూటీని పొగొడుతున్నారు. ‘మంచి పని చేశావు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం