AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thanuja Puttaswamy: కన్నీళ్లు ఆగడం లేదు.. మాటలు రావడం లేదు.. తనూజ ఎమోషనల్ పోస్ట్..

కొన్నేళ్ల క్రితం ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది తనూజ పుట్టస్వామి. అప్పట్లో బుల్లితెరపై ఈ సీరియల్ సంచలనం సృష్టించింది. సీరియల్ ముగిసిన తర్వాత మళ్లీ మరో సీరియల్ చేయలేదు. చాలా కాలం మీడియాకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇటీవల బిగ్ బాస్ షోతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది.

Thanuja Puttaswamy: కన్నీళ్లు ఆగడం లేదు.. మాటలు రావడం లేదు.. తనూజ ఎమోషనల్ పోస్ట్..
Thanuja
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 4:03 PM

Share

తనూజ పుట్టస్వామి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ముద్దా మందారం సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసింది. ఈ సీరియల్ ద్వారా అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. చాలా కాలం తర్వాత ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 షోతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. షో మొదటి నుంచి విన్నర్ ట్యాగ్ సొంతం చేసుకున్నఈ అమ్మడు.. చివరకు రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం తనూజ పుట్టస్వామి ఇన్ స్టా స్టోరీ నెట్టింట తెగ వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని.. దాన్ని చదువుతున్నానని చెప్పుకొచ్చింది. “నేను ఎంతో అదృష్టవంతురాలినో కదా. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. కానీ ఈసారి నేను చాలా ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నా కోసం ప్రత్యేకంగా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నమ్ముతారో లేదో.. ఇది చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకునేది మన ఫ్యామిలీ మాత్రమే. కానీ నా విషయంలో ఎంతో మంది అర్థం చేసుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది తనూజ.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

అలాగే తన కోసం ప్రత్యేకంగా డైరీ రాసిన అమ్మాయికి ఐ లవ్యూ చెప్పుకొచ్చింది. ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయలేదు తనూజ. ఇప్పుడు అగ్నీ పరీక్ష సీరియల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us