AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంశీకి ‘మహర్షి’ కిస్!

తాజా చిత్రం ‘మహర్షి’ సూపర్ హిట్ కావడంతో సంబరాలు చేసుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనకు ఇంతటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి “ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను” అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ సినిమాలో చూపిన ‘వీకెండ్‌ వ్యవసాయం’ కాన్సెప్ట్‌ […]

వంశీకి 'మహర్షి' కిస్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2019 | 4:06 PM

Share

తాజా చిత్రం ‘మహర్షి’ సూపర్ హిట్ కావడంతో సంబరాలు చేసుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనకు ఇంతటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దివ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక మహేశ్ తనకు ముద్దు పెడుతుండగా, సెల్ఫీ తీసుకున్న వంశీ, దీనికి “ఇదే నా జీవితంలో బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను” అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ సినిమాలో చూపిన ‘వీకెండ్‌ వ్యవసాయం’ కాన్సెప్ట్‌ ఎంతో మందిని ఆ దిశగా నడిపిస్తుండగా, యువత, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారాంతంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.

Follow Us