AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రామిస్‌.. పొరపాటున లైక్ కొట్టా: బండ్ల

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ పవర్‌ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ని ఉద్దేశించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రామిస్‌.. పొరపాటున లైక్ కొట్టా: బండ్ల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 12:58 PM

Share

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ పవర్‌ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ని ఉద్దేశించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వర్మ ఆఫీస్‌పై కూడా వారు దాడి చేశారు. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్ కోసం వర్మ కొన్ని వీడియోలను విడుదల చేశారు. అందులో ఒక వీడియోకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ లైక్ చేశారు. దీన్ని గమనించిన ఓ పవన్ అభిమాని బండ్లకు ట్విట్టర్‌లో మెసేజ్ చేశాడు.

”గదంతా కాదు బండ్ల అన్న గిది ఎందుకు లైక్ చేసినవ్”‌ అని ఓ నెటిజన్ బండ్లను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఈ నటుడు.. ”ప్రామిస్‌., ఏదో పొరపాటున అలా జరిగింది. ఇలా నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఏంటో నాకు తెలుసు. పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నా” అని కామెంట్ పెట్టారు. కాగా పవర్‌ స్టార్ చిత్రంలో బండ్ల గణేష్‌ని పోలిన పాత్ర కూడా ఉన్న సంగతి విదితమే.