సేతుపతికి జోడిగా అనుష్క..

తాజాగా సేతుపతి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజ‌య్ సేతుపతితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Ravi Kiran
  • Publish Date - 12:15 pm, Sat, 25 July 20
సేతుపతికి జోడిగా అనుష్క..

Anushka Shetty And Vijay Sethupathi Combo: తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు.  ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్‌ దర్బార్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్న సేతుపతి.. తమిళంలో తెరకెక్కుతున్న ‘మాస్టర్’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సేతుపతి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజ‌య్ సేతుపతితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకోవాలని నిర్ణయించారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయని సమాచారం. గతంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఎ.ఎల్‌.విజ‌య్ తెరకెక్కించిన ‘నాన్న’ చిత్రంలో అనుష్క కీలక పాత్రలో నటించిన సంగతి విదితమే. మరి ఆమె ఈ సినిమాకి ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.

Also Read:

 ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..