ఆసుపత్రికి రానంటూ కరోనా సోకిన వృద్ధురాలు హల్‌చల్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఓ గ్రామంలో కరోనా వైరస్ సోకిన ఓ వృద్ధురాలు హల్‌చల్ చేసింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఓ గ్రామంలో కరోనా వైరస్ సోకిన ఓ వృద్ధురాలు హల్‌చల్ చేసింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఎలాగోలా అంబులెన్స్‌లోకి ఎక్కించగా.. మార్గ మధ్యలో మూత్ర విసర్జనకు వెళ్లాలని అందులో నుంచి దిగి సిబ్బంది నుంచి తప్పించుకొని తిరిగి శంకరపట్నం చేరుకుంది. ఆ తరువాత ఎలాగోలా శంకరపట్నం బస్టాండ్ ఆవరణలో ఆమెను గుర్తించిన అధికారులు అంబులెన్స్ తీసుకెళ్లగా.. ఆసుపత్రికి రానంటూ మొండికేసింది. ఇలా గంట పాటు అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తరువాత ఎలాగోలా ఆమెకు నచ్చజెప్పగా.. ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వృద్ధురాలిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.



