AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగుబోతు భర్త వేధింపులు తాళలేక…పిల్లలతో కలిసి దారుణం

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు తెగించింది. కన్నబిడ్డలతో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిన మైకంలోనే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నించింది. కానీ,..

తాగుబోతు భర్త వేధింపులు తాళలేక...పిల్లలతో కలిసి దారుణం
Jyothi Gadda
|

Updated on: Jul 25, 2020 | 12:20 PM

Share

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు తెగించింది. కన్నబిడ్డలతో కలిసి కట్టుకున్నవాడిని కడతేర్చింది. తాగిన మైకంలోనే తన భర్త చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నించింది. కానీ, అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మల్కాపూర్‌కు చెందిన ఓ దంపతులు రోజూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కాగా, ఆ వ్యక్తి గత కొంతకాలంగా తాగుడుకు బానిసగా మారాడు. రోజూ తాగుతూ ఇంట్లో భార్య పిల్లలతో తరచూ గొడవలు పడుతుండే వాడు. తాగిన మైకంలో తండ్రి చేస్తున్న రచ్చను అతడి భార్య పిల్లలు భరించలేక పోయేవారు. ఈ క్రమంలోనే మొన్న ఒకరోజు పీకలదాకా తాగేసి వచ్చి ఇంట్లో గొడవపడ్డాడు. దీంతో ముగ్గురూ కలిసి అతడి మెడకు తాడు బిగించి ఉరివేసి చంపేశారు. నిద్రలోనే చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా పోలీసుల నిర్ధారించారు. భార్య పిల్లలను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Follow Us
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
అందరికంటే ముందే మేం ఇంటికిపోతున్నాం.. మా పాలిట విలన్స్ ఆ ఇద్దరే.!
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
విజయ్ చెల్లి ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి..
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
7-సీటర్ కార్లలో సంచలనం.. టర్బో ఇంజిన్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ
పీఎల్ 2026 నుంచి 'ధోనీ' దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!
పీఎల్ 2026 నుంచి 'ధోనీ' దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!