బాలయ్యా.. న్యూ లుక్‌లో బాగున్నావయ్యా..!

బాలకృష్ణ 105వ కొత్త సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కాగా.. బాలయ్య 105 సినిమాలోని లుక్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఈ లుక్‌లో హీరో బాలకృష్ణను.. ఇంతవరకూ చూడని విధంగా కనిపిస్తున్నారు. చాలా యంగ్‌గా.. ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నారు. ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ ఫొటో పోస్ట్‌ అయిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో ఫుల్‌గా […]

బాలయ్యా.. న్యూ లుక్‌లో బాగున్నావయ్యా..!
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 10:56 AM

బాలకృష్ణ 105వ కొత్త సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కాగా.. బాలయ్య 105 సినిమాలోని లుక్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ఈ లుక్‌లో హీరో బాలకృష్ణను.. ఇంతవరకూ చూడని విధంగా కనిపిస్తున్నారు. చాలా యంగ్‌గా.. ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నారు. ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.

ఈ ఫొటో పోస్ట్‌ అయిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో ఫుల్‌గా వైరల్‌ అవుతోన్నాయి. చాలా యంగ్‌గా కనిపిస్తోన్న బాలయ్య లుక్ చూస్తుంటేనే ఇంత క్రేజీగా ఉంటే.. ఇక సినిమాలో ఆయన ఎలా ఉండబోతున్నారని ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోయారు. కాగా.. ఈ సినిమాను సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్లు హీరోయిన్లు నటిస్తున్నారు. సంక్రాతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. కాగా.. ఈ ఫొటో.. ఓ ఫ్యాన్ బాలయ్యతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు సమాచారం.

Balakrishna New Look from KS Ravikumar Film Goes Viral