27 ఏళ్ళ తర్వాత ఆ పాత్రలో..?

తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ‘పింక్’ సినిమా.. రెండేళ్ల క్రిందట బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని దక్కించుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమా లాయర్ పాత్రను పోషించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నెర్కొండ పార్వై అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆగష్టు 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట నిర్మాత […]

  • Ravi Kiran
  • Publish Date - 12:54 am, Sun, 7 July 19
27 ఏళ్ళ తర్వాత ఆ పాత్రలో..?

తాప్సి ప్రధాన పాత్రలో వచ్చిన ‘పింక్’ సినిమా.. రెండేళ్ల క్రిందట బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని దక్కించుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమా లాయర్ పాత్రను పోషించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నెర్కొండ పార్వై అనే టైటిల్‌తో రీమేక్ చేశారు.

ఆగష్టు 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో సీనియర్ హీరో చేస్తే బాగుంటుందని.. అదీకూడా బాలకృష్ణకు ఈ క్యారక్టర్ సూట్ అవుతుందని రాజు భావిస్తున్నాడని తెలుస్తోంది.

బాలకృష్ణ 27 సంవత్సరాల క్రితం ‘ధర్మక్షేత్రం’ అనే సినిమాలో లాయర్‌గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ క్యారక్టర్ చేయలేదు. మరి బాలయ్య ఈ సినిమా అంగీకరిస్తాడా.. లేదా అనేది వేచి చూడాలి.