Balagam: ఇలాంటి సీన్‌ చూసి ఎన్నేళ్లు అవుతుందో.. బలగం మూవీ చేసేందుకు ఊరంతా ఒక చోట చేరి.

సినిమా మనిషి జీవితంలో ఒక భాగం అంటారు. మరీ ముఖ్యంగా తెలుగు వారిని, సినిమాలను విడదీసి చూడలేము. థియేటర్లకు ట్రాక్టర్లు, ఆటోల్లో వెళ్లడం.. ఊరంత ఓ చోట చేరి ప్రొజెక్టర్లలో సినిమాలు వీక్షించడం కొన్నేళ్ల క్రితం గ్రామాల్లో తరచుగా కనిపించేది. కానీ ప్రస్తుతం...

Balagam: ఇలాంటి సీన్‌ చూసి ఎన్నేళ్లు అవుతుందో.. బలగం మూవీ చేసేందుకు ఊరంతా ఒక చోట చేరి.
Balgam Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 31, 2023 | 9:58 AM

సినిమా మనిషి జీవితంలో ఒక భాగమని భావించే వారు ఎంతో మంది. మరీ ముఖ్యంగా తెలుగు వారిని, సినిమాలను విడదీసి చూడలేము. థియేటర్లకు ట్రాక్టర్లు, ఆటోల్లో వెళ్లడం.. ఊరంత ఓ చోట చేరి ప్రొజెక్టర్లలో సినిమాలు వీక్షించడం కొన్నేళ్ల క్రితం గ్రామాల్లో తరచుగా కనిపించేది. కానీ ప్రస్తుతం గజిబిజీ జీవితంలో అంత సమయం ఎక్కడిది చెప్పండి. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకసారి కలిసి సినిమా చూడలేనంత బిజీగా మారిపోయాయి జీవితాలు. అయితే ఓ సినిమా మాత్రం అందరినీ కలుపుతోంది. ఊరు ప్రజలంతా బస్సులు కట్టుకొని మరీ థియేటర్‌కి వెళ్లేలా చేసింది. ఊర జనమంతా ఓచోట చేరి సినిమా చేసేలా చేసింది. ఆ సినిమానే బలగం.

కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగాలు, కోపాలు, పగలు, ప్రేమలు ఇలా అన్ని ఎమోషన్స్‌ను అత్యద్భుతంగా చూపించారు వేణు. మనిషి చావు చుట్టూ అల్లుకున్న ఈ కథ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. జీవితంలో బంధాల విలువను తట్టిలేపుతోంది. చిన్న సినిమాగా విడుదలైన భారీ విజయాన్ని అందుకుందీ చిత్రం. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఊరు జనమంతా ఓ చోట చేరి సినిమాను వీక్షిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు వేణు షేర్‌ చేశారు. ఓ గ్రామంలో ప్రజలంతా గుడ్‌ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని బలగం మూవీని వీక్షించారు. చిన్నపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఓ చోట చేరి సినిమాను చూశారు. ఈ వీడియోను షేర్‌ చేసిన వేణు.. ‘నిన్న రాత్రి ఎక్కడో తెలియదు.. ఊరంతా కలిసి బలగం సినిమా చూశారు.. ఇలా ప్రతి పల్లె చూస్తున్నారు.. చాలా సంతోషంగా ఉంది.. ఇట్లా చూసి అసలైన మజా రావాలంటే థియేటర్లో చూడాలే.. అని థియేటర్లకు పోతున్నారు.. ఇంత ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు వేణు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..