AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్‌ కల నెరవేరిన వేళ.. సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

Prabhas: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరును ఇండియన్‌ ఫిలిమ్‌ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌, సాహోతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్..

Prabhas: డార్లింగ్‌ కల నెరవేరిన వేళ.. సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..
Prabhas
Narender Vaitla
|

Updated on: Feb 19, 2022 | 3:21 PM

Share

Prabhas: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరును ఇండియన్‌ ఫిలిమ్‌ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌, సాహోతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ను దండెత్తడానికి వస్తున్న ప్రభాస్‌ ఈ సినిమాలు విడుదల కంటే నటిస్తోన్న మరో చిత్రం ‘ప్రాజెక్ట్‌ కే’ (Project k). నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh bachchan) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ సైలెంట్‌గా ప్రాజెక్ట్‌ కే సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ శరవేగంగా నడుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్వయంగా తెలిపిన ప్రభాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. అమితాబ్‌కు సంబంధించి త్రోబ్యాక్‌ ఫోటోను పోస్ట్ చేసిన ప్రభాస్‌.. ‘నా కల నిజమైంది. లెజెండరీ అమితాబ్‌బచ్చన్ సర్‌తో ఈరోజు ప్రాజెక్ట్ కే మొదటి షాట్‌ను పూర్తి చేశాను’ అంటూ రాసుకొచ్చారు. ఇలా అమితాబ్‌తో నటించాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని ప్రభాస్‌ చెప్పుకొచ్చారన్నమాట.

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఇక నాగ అశ్విన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్‌ k అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టైమ్‌ ట్రావెలింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆదిత్య 369 సినిమాను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు ప్రాజెక్ట్‌ Kకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ చేసిన ప్రకటన కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య సన్నివేశాలను సైన్స్‌ ఫిక్షన్‌ సెట్స్‌లో చిత్రీకరించారని సమాచారం. మరి సినిమా నిర్మాణం పూర్తవ్వకముందే అంచనాలు పెంచేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Delhi: దేశ రాజధానిలో ఘోర ఘటన.. ఓ ప్లాట్‌లో పాక్షిక నగ్న స్థితిలో యువతి అనుమానాస్పద మృతి!

పాలిచ్చే తల్లులకు గుడ్ న్యూస్.. కాచిగూడ రైల్వే స్టేషన్ లో బేబీ ఫీడింగ్ రూం ఏర్పాటు..

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. జాతర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్