Major Movie: సినిమా చూస్తూ కంటతడి పెట్టిన ఆడియన్స్.. మేజర్ మూవీ ప్రివ్యూలో ప్రేక్షకుల భావోద్వేగం..
Major Movie: దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడం అందరికి సాధ్యం కాదు. అలా ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన వారే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి ఓ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్...
Major Movie: దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడం అందరికి సాధ్యం కాదు. అలా ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన వారే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి ఓ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన 26/11 దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జూన్3న విడుదల చేయనున్నారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏఎమ్‌బీ మాల్ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జైపూర్‌లో మేజర్ సినిమా ప్రివ్యూ వేశారు.
సినిమా చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు కంటతడి పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దేశం కోసం ప్రాణాలను వదిలిన వీరుడి జీవిత కథను వెండి తెరపై చూస్తున్న ప్రేక్షకుల భావోద్వేగాలకు ఈ వీడియో అద్దం పడుతోంది. ఇక సినిమా హాల్ ప్రేక్షకులు చప్పట్లు కొడుతు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అడివి శేష్.. ‘సినిమా చూస్తూ ప్రేక్షకులు మొదటిసారి చూస్తున్నాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే. నా జీవితంలో ఇదొక అద్భుత క్షణం’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
#Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX
— Adivi Sesh (@AdiviSesh) May 28, 2022
ఇక మేజర్ హీరోయిన్ శోభితా కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మరి జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..