AR Rahman’s ’99 Songs’ : ఆ ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు.. కితాబిచ్చిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్

ఆస్కార్ గ్రామీ అవార్డ్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈయ‌న కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్మాతగా మారారు. ఎ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా ర‌చ‌యిత‌గా రూపొందించిన చిత్రం `99 సాంగ్స్‌`.

AR Rahman’s '99 Songs' : ఆ ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు.. కితాబిచ్చిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్
Ar Rahman
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2021 | 6:40 PM

AR Rahman’s ’99 Songs’: ఆస్కార్ గ్రామీ అవార్డ్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. ఈయ‌న కొత్త అవ‌తారం ఎత్తారు. నిర్మాతగా మారారు. ఎ.ఆర్.రెహ‌మాన్ నిర్మాత‌గా ర‌చ‌యిత‌గా రూపొందించిన చిత్రం `99 సాంగ్స్‌`. రొమాంటిక్ మ్యూజికల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `99 సాంగ్స్‌` చిత్రం ద్వారా ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ వార్గాస్ అనే నూత‌న హీరహీరోయిన్లను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో ఇహాన్, ఎడిల్‌సీ వార్గాస్ జంటను స్క్రీన్‌పై చూసిన నెటిజ‌న్స్ నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. జియో స్టూడియోస్ సమర్పించిన ఈ ప్రేమ కథలో నటీనటులు మ్యూజికల్ రీసెర్చ్‌లో పాల్గొంటారు. వారి మ‌ధ్య ప్ర‌యాణాన్ని `99 సాంగ్స్` మూవీ తెలియజేస్తుంది. ఈ సంద‌ర్భంగా ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ “ఇహాన్‌, ఎడిల్‌సీ వార్గాస్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల‌ను `99 సాంగ్స్‌` చిత్రంతో ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. వారిద్ద‌రూ గొప్ప ఆర్టిస్టులు. జీవితంలో వీరిద్ద‌రూ మ‌రింత ఉన్నత స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ఇహాన్ భట్ మాట్లాడుతూ “99 సాంగ్స్‌` ట్రైల‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చాలా ఆనంద‌మేస్తుంది. మా సినిమాకు , మా సినిమా సంగీతానికి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. బాలీవుడ్‌లో ఎటువంటి నేపథ్యం లేనివారికి సులభంగా రాని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రెహ్మాన్ సార్‌కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్న. ఇది నమ్మశక్యం కాని ప్రయాణం“ అన్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో ఇహాన్ భట్, ఎడిల్‌సీ వార్గాస్ జంట‌గా రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Adipurush: ముందు జాగ్రత్త పడుతోన్న ‘ఆదిపురుష్’.. షూటింగ్ స్పాట్‌లో కేవలం..