AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupriya About 2020: 2020 భిన్నమైన సంవత్సరం..జీవితంలో విశ్రాంతి తీసుకొని.. మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడింది

కరోనా నేపథ్యంలో ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని బాలీవుడ్ నటి మోడల్ అనుప్రియా గోయెంకా చెప్పింది.  2020 గురించి ఆమె మాట్లాడుతూ ఇది చాలా భిన్నమైన సంవత్సరం..

Anupriya About 2020: 2020 భిన్నమైన సంవత్సరం..జీవితంలో విశ్రాంతి తీసుకొని.. మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడింది
Surya Kala
|

Updated on: Jan 18, 2021 | 7:26 PM

Share

Anupriya About 2020: కరోనా నేపథ్యంలో ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని బాలీవుడ్ నటి మోడల్ అనుప్రియా గోయెంకా చెప్పింది.  2020 గురించి ఆమె మాట్లాడుతూ ఇది చాలా భిన్నమైన సంవత్సరం.. జీవితంలో మనకు కొంత విరామం అవసరమని నేను అనుకుంటున్నాను, విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ఏడాది కాలం ఉపయోగపడిందని చెప్పింది. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఏర్పడిన మార్పు మంచిదే అంది. థియేటర్స్ క్లోజ్ కావడంతో ఓటిటి బాగా ఫేమస్ అయ్యిందని చెప్పింది. 2017 లో నుంచే ఓటిటీ లో పనిచేస్తున్నానని చెప్పిన అనుప్రియ. అప్పుడు ఓటిటీ లో పనిచేయడం సరైన నిర్ణయం అనుకోలేదని.. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను తీసుకుంది సరైన నిర్ణయమే అని భావిస్తున్నట్లు చెప్పింది.

అనుప్రియ బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఆశ్రమం 2 వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాధించింది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో తనకు చాలా మంచే జరిగిందని చెప్పింది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ జిందా హై, వార్, పద్మావత్ వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ 18 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో, వెబ్ సిరీస్ లో నటిస్తూనే మరో వైపు మోడల్ గా తనకంటూ పేరు సంపాదించుకుంది. మింత్రా బ్రాండ్ రూపొందించిన మొట్టమొదటి గే యాడ్ లో అనుప్రియ నటించి సంచలనం రేపింది.

Also Read: జేఈఈ, నీట్ పరీక్షల సిలబస్ కుదింపు ..ఆన్‌లైన్‌లో క్లాసులను నిర్వహిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం