Ankita Lokhande: పెళ్లి పీటలెక్కిన సుశాంత్‌ మాజీ ప్రేయసి.. వేడుకగా అంకిత, విక్కీల వివాహం..

మూడేళ్ల ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు బాలీవుడ్‌ నటులు అంకితా లోఖండే- విక్కీజైన్. మంగళవారం ముంబయిలోని గ్రాండ్‌ హయత్

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కిన సుశాంత్‌ మాజీ ప్రేయసి.. వేడుకగా అంకిత, విక్కీల వివాహం..
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 6:37 AM

మూడేళ్ల ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకున్నారు బాలీవుడ్‌ నటులు అంకితా లోఖండే- విక్కీజైన్. మంగళవారం ముంబయిలోని గ్రాండ్‌ హయత్ హోటల్‌ వేదికగా ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచారు. ఈ సందర్భంగా నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లికూతురు అంకిత గోల్డెన్‌ కలర్‌ లెహెంగాలో ముస్తాబవగా, వరుడు విక్కీ కూడా వధువుకు మ్యాచ్‌ అయ్యేలా బంగారు- తెలుపు రంగు షేర్వాణీలో రెడీ అయ్యాడు. సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వధూవరులిద్దూ పెళ్లి మండపం వద్దకు వింటేజ్‌ కారులో రావడం విశేషం. కరోనా నిబంధనల నేపథ్యంలో కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రస్తుతం అంకితా – విక్కీల గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘మణికర్ణిక’, ‘భాఘీ’ సినిమాల్లో మెరిసిన అంకిత అంతకుముందు పలు బాలీవుడ్‌ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె నటించిన ‘పవిత్ర రిష్తా’ ధారావాహిక బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ సంచలనం. ఈ సీరియల్‌ చిత్రీకరణ సమయంలోనే సుశాంత్‌- అంకితలు ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్లపాటు ఈ ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఈనేపథ్యంలోనే గత ఏడాది సుశాంత్‌ ఆత్మహత్య సమయంలో అంకితా పేరు కూడా బాగా వినిపించింది. ఇక సుశాంత్‌ బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది అంకిత. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. తాజాగా తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. అంతకుముందు ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాలు కూడా వేడుకగా జరిగాయి. ఎంగేజ్‌మెంట్, మెహందీ, హల్దీ, సంగీత్‌ తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయింది అంకిత. ఈక్రమంలో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Also Read:

Prakash Raj: యువతికి చేయూతనందించిన ప్రకాశ్‌రాజ్‌.. చదువుతో పాటు ఉద్యోగం వచ్చేలా ..

Rashmika Mandanna: నా పాత్ర గురించి తప్ప పుష్ప స్టోరీ నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక..

AP Government: టికెట్‌ రేట్లపై డివిజన్‌ బెంచ్‌కి.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!