AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నా పాత్ర గురించి తప్ప పుష్ప స్టోరీ నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న

Rashmika Mandanna: నా పాత్ర గురించి తప్ప పుష్ప స్టోరీ నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక..
Rashmika
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 16, 2021 | 12:44 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‏లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‏ను పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్కులో బన్నీ కనిపించనుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా.. రష్మిక మీడియాతో ముచ్చటించింది.

రష్మిక మందన్నా మాట్లాడుతూ.. పుష్ప కథ పూర్తిగా తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. పుష్ప కథ గురించి వినగానే మీరు ఏమనుకున్నారు అని ప్రశ్నించగా.. నాకు పుష్ప కథ గురించి తెలియదని.. సుకుమార్ గారు పూర్తిగా కథ చెప్పలేదు. నా పాత్ర ప్రాధాన్యత గురించి మాత్రమే చెప్పారు. ఆయన పట్ల ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను. అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడు నా పాత్ర విషయంలో నాకు సంతృప్తి పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు. నా పాత్రకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం వచ్చింది. ఫస్ట్ పార్టు పూర్తవుతోందంటే బాధగా అనిపించింది. రెండవ భాగం ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇందులో మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. సునీల్, జబర్ధస్త్ అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?