మనసును కదిలిస్తోన్న ‘దొరసాని’ ట్రైలర్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా […]

మనసును కదిలిస్తోన్న ‘దొరసాని’ ట్రైలర్


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ట్రైలర్‌లో కథ ఇప్పటికే వచ్చిన చాలా ప్రేమకథా చిత్రాలను తలపిస్తున్నప్పటికీ.. దొరల కాలం, తెలంగాణ యాస, సంగీతం కొత్తగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. ఇక టీజర్‌లో పెద్దగా ఆకట్టుకోనప్పటికీ.. ట్రైలర్‌లో మెప్పించాడు ఆనంద్. మొత్తానికి ట్రైలర్‌తో అంచనాలను పెంచేశాడు జూనియర్ దేవరకొండ. కాగా సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. జూలై 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu