రికార్డు సృష్టించిన అనుష్క ‘నిశ్శబ్దం’..!

కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడం, థియేటర్లు క్లోజ్ అవ్వడంతో షూటింగ్ జరుపుకున్న పలు చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 11:00 am, Sun, 18 October 20
రికార్డు సృష్టించిన అనుష్క 'నిశ్శబ్దం'..!

Anushka Nishabdham movie: కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడం, థియేటర్లు క్లోజ్ అవ్వడంతో షూటింగ్ జరుపుకున్న పలు చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అందులో అనుష్క నటించిన నిశ్శబ్దం కూడా ఒకటి. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీకి క్రిటిక్స్‌, వీక్షకుల నుంచి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. క్లైమాక్స్‌లో మాధవన్‌ ఎపిసోడ్‌ అంత ఆకట్టుకోలేదని కొంతమంది అన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది. నిశ్శబ్దంను ఎక్కువ మందిని చూసినట్లుగా సమాచారం. నిశ్శబ్దం కంటే ముందు నాని నటించిన ‘వి’ కూడా అమెజాన్‌లో విడుదల అయ్యింది. దాని కంటే ఎక్కువ మంది నిశ్శబ్దంను చూసినట్లు సమాచారం.

కాగా ఈ మూవీలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా.. మాధవన్‌, షాలిని, సుబ్బరాజు, అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కోన వెంకట్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతం అందించగా.. గిరీష్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,436 కొత్త కేసులు.. 6 మరణాలు

ఫ్యాన్సీ స్టోర్‌లో కరోనా కిట్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు