ఫ్యాన్సీ స్టోర్‌లో కరోనా కిట్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ సెంటర్‌లో మాత్రమే కరోనా టెస్ట్ చేయాలి అన్న రూల్స్‌ని కొంతమంది బేఖాతారు చేస్తున్నారు.

ఫ్యాన్సీ స్టోర్‌లో కరోనా కిట్స్‌.. వెలుగులోకి సంచలన విషయాలు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:36 AM

Corona Kits fancy Store: ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ సెంటర్‌లో మాత్రమే కరోనా టెస్ట్ చేయాలి అన్న రూల్స్‌ని కొంతమంది బేఖాతారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో కరోనా కిట్స్ అమ్ముతున్నారు. అంతేకాదు ఎక్స్‌పీరియన్స్ లేని టెక్నీషియన్లు ఇంటికి వచ్చి టెస్ట్‌ చేస్తున్నారు. పీపీఈ కిట్‌లు ధరించకుండా, ప్రభుత్వ రికార్డులో కూడా పెట్టకుండా కొంతమంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలీడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. నూజివీడు తహసీల్దార్ సురేష్‌ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఫ్యాన్సీ స్టోర్ యజమానికి ఈ కిట్స్‌ని ఎవరు సప్లై చేస్తున్నారని విచారణ జరుపుతున్నారు.

Read More:

Bigg Boss 4: నోయల్‌ని నాన్నలా ట్రీట్ చేస్తానన్న హారిక

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు: ఇవాళ బాలా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ