‘ఖిలాడి’గా రవితేజ.. మరో మూవీని ప్రకటించిన మాస్‌రాజా
మాస్‌రాజా రవితేజ మరో మూవీని ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడిగా రవితేజ కనిపించబోతున్నారు.
Ravi Teja Khiladi movie: మాస్‌రాజా రవితేజ మరో మూవీని ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడిగా రవితేజ కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు ఓ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. ఆయన సరసన డింపుల్ హయతీ, మీనా చౌదరి నటించనున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇవాళ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా ప్రస్తుతం రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్‌లో నటిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శ్రుతీహాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read More:
పీహెచ్డీ పూర్తి చేసుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
రికార్డు సృష్టించిన అనుష్క ‘నిశ్శబ్దం’..!
RAVI TEJA IS #KHILADI… #RaviTeja enacts dual roles in #Telugu film #Khiladi… Costars #MeenakshiChaudhary and #DimpleHayathi… Directed by Ramesh Varma… Produced by Satyanarayana Koneru… Mahurat today at 11.55 am… Shoot begins next month. #RT67 #RT67FirstLook pic.twitter.com/n7BKGfXNqR
— taran adarsh (@taran_adarsh) October 18, 2020