AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

Tech News: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏసీలు, ఫ్యాన్‌ల ముందు ఉండిపోతుంటారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరుగుతుంది. ఏసీ ఆన్‌ చేసిన తర్వాత ఫ్యాన్‌ కూడా వాడినట్లయితే కరెంటు బిల్లు పెరుగుతుందా..?

Tech News: ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Ac, Ceiling Fan
Subhash Goud
|

Updated on: Apr 13, 2026 | 4:29 PM

Share

Tech News: వేసవి కాలంలో ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి మనం ఏసీని ఎక్కువగా వాడుతుంటాం. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా వేస్తే కరెంట్ బిల్లు రెట్టింపు అవుతుందా? అని. కానీ శాస్త్రీయంగా చూస్తే దీని వల్ల మీ కరెంట్ బిల్లు పెరగడం కాదు తగ్గుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

  1. చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది: ఏసీ గదిలోని గాలిని చల్లబరిస్తే, ఆ చల్లటి గాలిని గదిలోని మూలమూలకూ త్వరగా చేరవేసే పనిని ఫ్యాన్ చేస్తుంది. దీనివల్ల గది మొత్తం తక్కువ సమయంలోనే చల్లబడుతుంది
  2. కంప్రెసర్ మీద లోడ్ తగ్గుతుంది: గది త్వరగా చల్లబడటం వల్ల ఏసీ కంప్రెసర్ ఎక్కువ సేపు పని చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కంప్రెసర్ మీద లోడ్ తగ్గి, విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.
  3. విండ్ చిల్ ఎఫెక్ట్: మీరు ఏసీ టెంపరేచర్‌ను 20°C లో ఉంచే బదులు, 24°C లేదా 26°C వద్ద సెట్ చేసి ఫ్యాన్ ఆన్ చేయండి. ఫ్యాన్ గాలి వల్ల మీ శరీరానికి ‘విండ్ చిల్ ఎఫెక్ట్’ కలిగి, ఎక్కువ టెంపరేచర్ వద్ద కూడా గది చాలా చల్లగా ఉన్న అనుభూతిని ఇస్తుంది.
  4. జేబుకు ఆదా: ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల ఏసీ తక్కువ సమయం పనిచేస్తుంది. తద్వారా నెలాఖరుకు మీ కరెంట్ బిల్లు తగ్గి మీ జేబులో డబ్బులు మిగులుతాయి. అందుకే ఇకపై ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేయడం మర్చిపోకండి.
  5. ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us