AP Inter Results 2026: విద్యార్ధులకు అలర్ట్.. ఈ వారంలోనే ఇంటర్ ఫలితాలు విడుదల! ఏ తేదీనంటే..
రాష్ట్ర ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు

అమరావతి, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు రాశారు. అందిన సమాచారం మేరకు ఏప్రిల్ 18 లేదా 19 తేదీల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. ఫలితాల విడుదలకు ముందు మార్కుల ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 16 నాటికి ముగిసే అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభ మార్చి 23తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పలు కీలక మార్పులు చేశారు. అందువల్ల పరీక్షల నిర్వహణ దాదాపు నెల రోజులపాటు కొనసాగింది. దీంతో మూల్యాంకనం కాస్త ఆలస్యమైంది. తాజాగా ఈ ప్రక్రియ పూర్తవ్వడంతో సాధ్యమైనంత త్వరలోనే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ వారం ముగింపు నాటికి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఆదివారమే (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.20శాతం మంది, సెకండ్ ఇయర్‌లో 70.58 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం గరిష్టంగతంలో కన్నా ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.20 శాతం, సెకండ్ ఇయర్‌లో 70.58 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




