Bigg Boss 4: నోయల్‌ని నాన్నలా ట్రీట్ చేస్తానన్న హారిక

బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తరువాత ఏమైనా జరగొచ్చు. అంతవరకు పెద్దగా తెలియని వారు మంచి మిత్రులుగా మారొచ్చు.

Bigg Boss 4: నోయల్‌ని నాన్నలా ట్రీట్ చేస్తానన్న హారిక
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:09 AM

Bigg Boss 4 Noel Harika: బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లిన తరువాత ఏమైనా జరగొచ్చు. అంతవరకు పెద్దగా తెలియని వారు మంచి మిత్రులుగా మారొచ్చు. కాస్త తెలిసిన వాళ్లు ఇంకాస్త క్లోజ్ అవ్వొచ్చు. మంచి మిత్రులు శత్రువులుగా మారొచ్చు. ఇక ఈ సీజన్‌లో హారిక, నోయల్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ వారం ఎలిమినేషన్‌లో హారికను సేవ్ చేశారు నోయల్‌. ఇక టాస్క్‌లో భాగంగా ఇటీవల హారిక తన వెంట్రుకలను భుజంపైకి కట్ చేసుకోవాల్సి ఉండగా.. ఆ షేవ్‌ని నోయల్‌ చేశారు. ఆమె ఇబ్బంది పడకుండా హారిక అందంగా ఉండేలా నోయల్‌ వెంట్రుకలను కట్ చేశారు. దానిపై మాట్లాడిన హారిక.. ఈ సేవింగ్‌ తనకు చాలా స్పెషల్ అని చెప్పింది. నోయ‌ల్‌ను త‌న‌ నాన్న‌లా ట్రీట్ చేస్తాన‌ని వెల్లడించింది.

కాగా ఆ మధ్యన తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. తాము ఇంటర్‌లో ఉన్నప్పుడు అమ్మ, నాన్న విడిపోయారని.. ఆ తరువాత అమ్మ దగ్గర ఉన్నామని హారిక చెప్పిన విషయం తెలిసిందే. కొన్ని సార్లు తన నాన్న పేరు గుర్తు కూడా రాదని భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

Read More:

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు: ఇవాళ బాలా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ

Bigg Boss 4: మోనాల్‌ కోసం ముందుకొచ్చిన అరియానా