అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ రివ్యూ

మూవీ: ఏబీసీడీ నటీనటులు: అల్లు శిరీశ్, రుక్సార్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు తదితరులు దర్శకత్వం: సంజీవ్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంగీతం: జుడా సాండీ మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నటుడిగా ఇంతవరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోలేదు అల్లు శిరీష్. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో మలయాళంలో విజయం సాధించిన ఏబీసీడీ రీమేక్‌ను ఎంచుకున్నాడు. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజైన ఈ చిత్రంతో […]

అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ రివ్యూ
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 1:27 PM

మూవీ: ఏబీసీడీ నటీనటులు: అల్లు శిరీశ్, రుక్సార్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు తదితరులు దర్శకత్వం: సంజీవ్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంగీతం: జుడా సాండీ

మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నటుడిగా ఇంతవరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోలేదు అల్లు శిరీష్. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో మలయాళంలో విజయం సాధించిన ఏబీసీడీ రీమేక్‌ను ఎంచుకున్నాడు. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజైన ఈ చిత్రంతో అల్లు శిరీష్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? ఆయన కోరుకున్న హిట్ ఇప్పటికైనా వచ్చిందా..? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ: న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్(నాగబాబు)కుమారుడు అరవింద్ ప్రసాద్(అల్లు శిరీష్) అలియాస్ అవి. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం(భరత్‌)తో కలిసి ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కుమారుడికి డబ్బు విలువ, జీవితం విలువ తెలియజేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, భాషాలను భారత్‌కు పంపుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి అనుకోకుండా స్థానిక రాజకీయ నాయకుడు భార్గవ్(రాజా)తో గొడవ అవుతుంది. అసలు అవి, భార్గవ్ మధ్య గొడవకు కారణమేంటి..? అమెరికాలో జల్సాలు చేసే అవి, భాషాలు భారత్‌లో ఎలా సర్దుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇక్కడకు అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా ఎలా మారాడు..? అన్నదే మిగిలిన కథ.

నటీనటులు: తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా స్టోరీని ఎంచుకున్న అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి బాధ్యత లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేసే యువకుడి పాత్రలో సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సీన్లలో మంచి నటనను కనబరిచాడు. ఇక భరత్ కూడా తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సార్‌కు పెద్ద పాత్ర లేనప్పటికీ.. లుక్స్ పరంగా మంచి మార్కులు సాధించింది. విలన్‌గా రాజా పర్వాలేదనిపించాడు. ఇక ఇతర పాత్రలో నాగబాబు, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాసరావు తదితరులు ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్: కథ కొన్ని కామెడీ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్: బలమైన సన్నివేశాలు లేకపోవడం

విశ్లేషణ: మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులతో రీమేక్‌లో చేయడంలో కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి ఫర్వాలేదనిపించాడు. కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. బలమైన సన్నివేశాలు లేకపోవడంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కన్నడ దర్శకుడు జుడా సాండీ అందించిన సంగీతం బావుంది. రామ్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు