AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ ఆన్ ట్రాక్..హ్యట్రిక్‌పై ఎటాక్

గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్లాప్ తర్వాత అల్లువారబ్బాయి..తన తర్వాతి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా కేేర్ తీసుకుంటున్నాడు. ఈ సారి కొడితే మెగా మోత గట్టిగా వినేపించేలా ఉండాలని.. కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే గతంలో రెండు బాక్సాఫీస్ బోనాంజాలు అందించిన త్రివిక్రమ్‌తో మూవీకి కమిట్ అయ్యాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత […]

షూటింగ్ ఆన్ ట్రాక్..హ్యట్రిక్‌పై ఎటాక్
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2019 | 12:57 PM

Share

గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్లాప్ తర్వాత అల్లువారబ్బాయి..తన తర్వాతి ప్రాజెక్ట్స్ విషయంలో చాలా కేేర్ తీసుకుంటున్నాడు. ఈ సారి కొడితే మెగా మోత గట్టిగా వినేపించేలా ఉండాలని.. కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే గతంలో రెండు బాక్సాఫీస్ బోనాంజాలు అందించిన త్రివిక్రమ్‌తో మూవీకి కమిట్ అయ్యాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ పూజా కార్య్రమాలు ప్రారంభమైన ఈసినిమా నేటి నుంచి సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న తమన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు.

హీరోగా అల్లు అర్జున్‌కు ఇది 19వ సినిమా. ఈ సినిమాలో అల్లు అర్జున్  కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్‌లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.  అల్లు అర్జున్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో నటించారు. మరోవైపు టబు అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటిస్తోంది. పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. దసరాకు రిలీజ్ చేసేలా షూట్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్, అల్లు అర్జున్‌లు హాట్రిక్ నమోదు చేస్తారా లేదా అనేది చూడాలి.