Tollywood: ‘బన్నీ’తో కలిసి నటించిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడెం చేస్తోందంటే..

ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది గౌరీ ముంజల్. మొదటి సినిమాతోనే..

Tollywood: 'బన్నీ'తో కలిసి నటించిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఇప్పుడెం చేస్తోందంటే..
Gowri Munjal
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 23, 2022 | 8:35 AM

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన చిత్రం ‘బన్నీ’. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది గౌరీ ముంజల్. మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

గౌరీ ముంజల్ నటించిన ‘బన్నీ’, ‘శ్రీకృష్ణ 2006’, ‘గోపి గోడమీద పిల్లి’, ‘కౌసల్యా సుప్రజా రామా’, ‘బంగారు బాబు’ లాంటి చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా.. అమ్మడికి మాత్రం కొత్త సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. 2009లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘బంగారు బాబు’ గౌరీ ముంజల్‌కు చివరి చిత్రం. ఇక 2011వ సంవత్సరం మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో కనిపించిన గౌరీ ముంజల్ ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు దూరమైంది. పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలకు దూరమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో నివాసముంటున్న గౌరీ ముంజల్ పలు వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..