‘అల’ సెలబ్రేషన్స్: దర్శకులకు బన్నీ గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వెళ్లారంటే..!

‘అల’ ఇచ్చిన విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తోన్న బన్నీ.. తాజాగా మరో గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి దర్శకులు, నిర్మాతలు చాలా మందే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. ఫ్రమ్ ద లెజండ్ టు ది లేటెస్ట్ డైరక్టర్స్ అంటూ ఓ కామెంట్ పెట్టారు. ఇక బన్నీ ఇచ్చిన […]

'అల' సెలబ్రేషన్స్: దర్శకులకు బన్నీ గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు వెళ్లారంటే..!

‘అల’ ఇచ్చిన విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తోన్న బన్నీ.. తాజాగా మరో గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి దర్శకులు, నిర్మాతలు చాలా మందే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బన్నీ.. ఫ్రమ్ ద లెజండ్ టు ది లేటెస్ట్ డైరక్టర్స్ అంటూ ఓ కామెంట్ పెట్టారు. ఇక బన్నీ ఇచ్చిన ఈ పార్టీలో కె.రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, కొరటాల శివ, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, రాహుల్ రవీంద్రన్, మారుతి, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, విక్రమ్ కె కుమార్, మధుర శ్రీధర్ రెడ్డి, పరశురామ్, శ్రీనువైట్ల, కల్యాణ్ కృష్ణ, ఎస్కేన్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బన్నీ సోదరులు అల్లు వెంకటేష్, అల్లు శిరీష్‌లతో పాటు మరికొందరు సన్నిహితులు కూడా ఈ పార్టీలో భాగం అయ్యారు. వీరందరూ బన్నీకి ప్రత్యేక కృతఙ్ఞతలను తెలిపారు.

కాగా సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన అల వైకుంఠపురములోకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.150కోట్ల షేర్‌ను వసూల్ చేయడంతో పాటు బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ హిట్‌తో తమ కాంబినేషన్లో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు బన్నీ, త్రివిక్రమ్. ఇదిలా ఉంటే త్వరలో సుకుమార్ దర్శకత్వంలో మూడో సినిమాలో బన్నీ నటించబోతున్నారు. ఈ మూవీతో పాటు కోలీవుడ్ దర్శకుడు మురగదాస్‌కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

https://www.instagram.com/p/B8GiTpCnn8V/

Published On - 7:49 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu