30 ఏళ్ల తరువాత.. చిరుకు విలన్‌గా మోహన్‌బాబు..?

మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఈ జోడికి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్‌లో దాదాపుగా ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కాంబినేషన్లో దాదాపుగా డజన్‌కు పైగా సినిమాలు వచ్చాయి. వీటన్నింటిలో రెండు, మూడు మినహాయించి.. చాలా సినిమాల్లో చిరుకు విలన్‌గా నటించారు మోహన్ బాబు. అంతేకాదు అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే కొదమ సింహం తరువాత ఈ కాంబోలో సినిమా రాలేదు. […]

30 ఏళ్ల తరువాత.. చిరుకు విలన్‌గా మోహన్‌బాబు..?

మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఈ జోడికి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్‌లో దాదాపుగా ఒకేసారి కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కాంబినేషన్లో దాదాపుగా డజన్‌కు పైగా సినిమాలు వచ్చాయి. వీటన్నింటిలో రెండు, మూడు మినహాయించి.. చాలా సినిమాల్లో చిరుకు విలన్‌గా నటించారు మోహన్ బాబు. అంతేకాదు అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే కొదమ సింహం తరువాత ఈ కాంబోలో సినిమా రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం 30ఏళ్ల తరువాత వీరిద్దరు ఢీ కొట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో 25కోట్లతో వేసిన సెట్‌లో చిరుపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు కొరటాల. కాగా ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు కొరటాల మోహన్ బాబును సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు ఇందులో నటించేందుకు మోహన్ బాబు కూడా ఆసక్తిని చూపినట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు మోహన్ బాబు అదనపు ఆకర్షణ‌గా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, రెజీనా ప్రత్యేక గీతంలో కనిపించనుంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Published On - 8:28 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu