లవర్స్ డే న అక్కినేని కపుల్ మజిలీ టీజర్

TV9 Telugu Digital Desk

Updated on: Feb 13, 2019 | 12:40 PM

పెళ్లి తర్వాత క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు చిత్ర యూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మజిలీ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య, సమంత కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేశారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత […]

లవర్స్ డే న అక్కినేని కపుల్ మజిలీ టీజర్

పెళ్లి తర్వాత క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు చిత్ర యూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మజిలీ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య, సమంత కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేశారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం మజిలీ.

ప్రస్తుతం మజిలీ చివరి షెడ్యూల్  హైదరాబాద్ లో జరుగుతుంది. దివ్యాంశా కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ తో మజిలీ సినిమా వస్తోంది. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu